Bridge Collapsed: ఘోరం.. వంతెన కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..

Pune Bridge Collapsed: పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మంది వరకు గల్లంతయ్యారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం 

Written by - Renuka Godugu | Last Updated : Jun 15, 2025, 05:02 PM IST
Bridge Collapsed: ఘోరం.. వంతెన కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..

Pune Bridge Collapsed: వరుస ప్రమాదాలు బెంబేలెత్తి పోయేలా చేస్తున్నాయి. ఈరోజు ఆదివారం మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలోని మావాల్ తాలూకా ఇంద్రాయణి నదిపై ఘోర ప్రమాదం జరిగింది. వంతెన ఆకస్మాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. 25 మంది వరకు గల్లంతయ్యారు. మావాల్‌ ఒక ప్రసిద్ధ ప్రదేశం ఎంతోమంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంద్రాయణి నదిపై ఒక వంతెన ఉంది. ఈరోజు అకస్మాత్తుగా ఈ వంతెన కుప్పకూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు నదిలో మునిగిపోయారు. ఇందులో కొందరు చనిపోగా.. మరికొందరిని కాపాడారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం..

అయితే ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వచ్చారు. ఒక్కసారిగా అందరూ వంతెనపై నిలబడడంతో బరువు ఎక్కువై కూలిపోయింది. అయితే ఎంతమంది ప్రమాదంలో మునిగిపోయారో తెలీదు. ఈ వంతెన మాత్రం పాతది అని చెబుతున్నారు. ఇందులో కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు అని అనుమానిస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే ఎన్టీఆర్ బృందాలు, అగ్నిమాపక దళం కూడా వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఎక్కువ మంది ఒకే స్థలంలో గుమిగూడి ఉండ వద్దని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కుందమాల ఒక పర్యాటక ప్రదేశం వర్షాకాలంలో ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. ప్రధానంగా శని, ఆదివారల్లో పెద్ద సంఖ్యలో కిక్కిరిసిపోతారు. అయితే వీళ్ళ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి పెద్ద ప్రమాదం చోటుచేసుకుందన్నారు. అయితే కొన్ని రోజులుగా పూణే ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రాయణి నది నీటి ప్రవాహం పెరిగింది. ఆ నీటి కళను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఈ వంతెన శిథిలావస్తకు చేరుకుంది. అయితే, అక్కడ నదిని ఆస్వాదిస్తూ వంతెన పై సెల్ఫీలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే 2022 అక్టోబర్ 30న గుజరాత్ లో మోర్బీలో కూడా ఒక సస్పెన్షన్ వంతెన కూలిపోయి 135 మంది మరణించారు. అది కూడా కెపాసిటీకి మించి 500 మందికి పైగా గుమిగూడడంతో శిథిలావస్థకు చేరుకున్న వంతెన కుప్పకూలిపోయింది.

Also Read :  Video: ఇజ్రాయెల్‌ మిస్సైల్‌ దాడులతో ఇరాన్‌కు చావుదెబ్బ.. ఆర్మీ కీలక నేతలు మృతి..

Also Read :  భగ్గుమంటున్న పశ్చిమాసియా.. మిస్సైల్ దాడితో తగలబడి పోతున్న ఎయిర్ పోర్టు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News