Pune bus Rape Case: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్.. మహిళ అంగీకారంతోనే ఘటన.!.. లాయర్ షాకింగ్ కామెంట్స్..

Pune bus rape case update: పూణే బస్ స్టాండ్ లో మహిళపై వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడి తరపున వాదిస్తున్నలాయర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2025, 05:20 PM IST
  • పూణే అత్యాచారం ఘటనలో బిగ్ ట్విస్ట్..
  • మహిళ ఎందుకు అరవలేదని లాయర్ ప్రశ్నలు..
Pune bus Rape Case: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్.. మహిళ అంగీకారంతోనే  ఘటన.!.. లాయర్ షాకింగ్ కామెంట్స్..

Pune bus rape case lawyer controversy comments video: ఇటీవల మహా రాష్ట్రలోని పూణేలో చోటు చేసుకున్న ఘటన దేశంలో సంచలనంగా మారింది. పూణేలో ఒక మహిళలను దత్రాత్రేయ రాందాస్ అనే కేటుగాడు.. స్వర్గేట్ బస్ స్టేషన్ లో అత్యాచారం చేశాడు. మహిళ తాను ఎక్కాల్సిన బస్సు కోసం వేచి చూస్తుంది. ఇంతలో ఆగంతకుడు.. టక్ వేసుకుని వచ్చి.. అక్కా అని పిలుస్తు మీరు ఎక్కాల్సిన బస్సు మరోక చోటులో ఉందని ఆమెను నమ్మించాడు. అంతేకాకుండా.. బస్సులో లైట్ లేదని ఆమె అనుమానం వ్యక్తం చేయగా.. బస్సులోని ప్రయాణికులు పడుకున్నారని కూడా చెప్పాడు. దీంతో మహిళ లోపలికి వెళ్లగానే డోర్ మూసేసి ఆమెపై అత్యాచారం చేశాడు.ఈ ఘటన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు.

Add Zee News as a Preferred Source

 

ఈ క్రమంలో మహిళ తన ఫ్రెండ్ కు సమాచారం  ఇచ్చింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంకు కేవలం 100 మీటర్ల దూరంలో పోలీసు స్టేషన్ ఉంది. అయితే.. ఈ ఘటనను పోలీసులు సీరియస్ తీసుకున్నారు. పూణే వ్యాప్తంగా పోలీసుల్ని అరర్ట్ చేశారు. జాగీలాలను రంగంలోకి దించారు. మరోవైపు డ్రోన్ లతో కూడా నిందితుడి  కోసం గాలింపు చర్చలు చేపట్టారు.నిందితుడు స్థానికంగా ఉన్న చెరుకు తోటల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వెంటనే అతడి కోసం వేట ప్రారంభించారు. ఇంతలో నిందితుడు.. దాహాంగా, ఆకలిగా ఉండటంతో సమీపంలోని ఇంటికి వెళ్లాడు. సదరు ఇంటి వాళ్లు.. అతడి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు దత్తాత్రేయ్ రాందాస్ గడేను అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి రెండు వారాల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో కోర్టులో నిందితుడి తరపున లాయర్  షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Read more: TCS Employee Wife Video: రోజు తాగోచ్చి ఆ పని.. టీసీఎస్ భర్త గురించి షాకింగ్ నిజాలు బైటపెట్టిన భార్య.. వీడియో వైరల్..

మహిళ అత్యాచారం జరిగేటప్పుడు ఎందుకు అరవలేదని ఆయన ప్రశ్నించారు. పొద్దున ఈ ఘటన జరిగింది. చాలా మంది అప్పుడే తమ కార్యకలాపాలకు వెళ్తుంటారు. ఒక వేళ మహిళ ప్రతిఘటించి.. అరిచి, కేకలు వేస్తే.. ఎవరైన ఆమెను కాపాడే అవకాశం ఉంటుందని కూడా లాయర్ వ్యాఖ్యలు చేశారు.

మహిళ తన ఇష్టాను సారమే.. అతనితో శారీరకంగా కలిసిందని కూడా లాయర్ మాట్లాడారు. మరొవైపు ఇప్పటికే బస్సులో మహిళల లోదుస్తులు, కండోమ్ లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News