Pune Rape Case Update: పుణే రేప్‌ కేసు నిందితుడి అరెస్ట్‌.. బస్సులో వందల కండోమ్స్‌, మహిళల లోదుస్తులు..

Pune Rape Case Accused Detained Video: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూనే రేప్‌ కేసు నిందితుడిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన బస్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళను నిందితుడు మోసం చేసి ఎంఎస్ఆర్‌టీసీ బస్సులోకి తీసుకువెళ్లి రేప్‌ చేశాడు. అయితే, ఫిబ్రవరి 28 ఈరోజు ఉదయం శిరూర్‌ పరిధిలో పూనే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 28, 2025, 09:53 AM IST
Pune Rape Case Update: పుణే రేప్‌ కేసు నిందితుడి అరెస్ట్‌.. బస్సులో వందల కండోమ్స్‌, మహిళల లోదుస్తులు..

Pune Rape Case Accused Detained Video: పూనే బస్సులో రేప్‌ కేసు నిందితుడిని పూనే స్పెషల్‌ బ్రాంచీ పోలీసులు ఈరోజు ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ పూనే బస్ స్టాప్ లో జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూనే పోలీస్ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  దీంతో వామపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 25వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బాధితురాలు బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుంది. 

Add Zee News as a Preferred Source

ఆమెతో మాటలు కలిపాడు నిందితుడు. అక్కా అంటూనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు.. ఆమె తన ఊరికి వెళ్లే బస్సు గురించి అర తీసింది . దగ్గర్లోనే బస్ డిపో వద్ద పార్కు చేసి బస్సు ఉందని చెప్పాడు ఆ కామాందుడు. ఆమెను ఎంఎస్‌ఆర్‌టీసీ బస్సు వద్దకు తీసుకు వెళ్ళాడు. బస్సులో లైట్లు పోవడంతో ఆమె సంకోచించింది.  అయితే ప్రయాణికులు అంతా నిద్రపోయారు.. అందుకే లైట్లు ఆఫ్‌ చేశామని చెప్పాడు. ఈ దృశ్యాలు అన్నీ బస్‌ డిపోలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ యువతి బస్సులోపలికి వెళ్లాక డోర్ పెట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

ఈ ఘోరం బస్‌ డిపోలో.. అది కూడా పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలోనే జరిగింది. రేప్ చేసిన నిందితుడు దర్జాగా పారిపోయాడు. ఈనేపథ్యంలో పోలీసులు కూడా అతడిని పట్టిస్తే లక్ష రూపాయలు రివార్డు ప్రకటించారు. అయితే ఈ నిందితుడిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యయి. చోరీ, చైన్స్ స్నాచింగ్ వంటి కేసులు ఇతనిపై ఉన్నాయి. జైలుకు వెళ్లిన ఇతను 2019లో బెయిల్ పై బయటకు వచ్చాడు.

 

సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని వెతకడానికి 13 బృందాలుగా వెతికారు. స్నైఫర్‌ డాగ్న్‌, డ్రోన్ల సహాయంతో నిన్నంతా చెరుకు తోటలో గాలించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశాల మేరకు స్వర్గేట్‌ డిపకి చెందిన 23 మంది భద్రత సిబ్బందిని కూడా తొలగించారు. కొత్త సిబ్బందిని నియమించారు.ఇక డిప్యూటీ సీఎం అజిత్ పవర్ కూడా పోలీసు కమిషనర్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. అత్యంత దారుణం ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో ఇలాంటి ఘోరం జరగడం.

ఇదీ చదవండి: తిరుమలలో మార్చి 14న ప్రత్యేక వేడుక.. ఈ భక్తులు రావొద్దని చెప్పిన టీటీడీ

బస్సులో వందల కండోమ్స్‌..
పూణే రేప్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు యువతిని రేప్‌ చేసిన బస్సులో కొన్ని వందల సంఖ్యలో కండోమ్‌లు, మహిళల లోదుస్తులను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ మానవమృగం ఇంకా ఎంతమంది ఆడవాళ్లపై ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడో అని ఆరా తీస్తున్నారు. 

ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News