)
Viral Video: పాములు చెట్లు, భూమిపై ఎక్కడైనా సంచరించగలవు. అయితే పొడుగ్గా నిటారుగా ఉన్న చెట్లెక్కడం చాలా అరుదుగా కన్పిస్తుంది. ఈ వీడియోలో ఓ భారీ కొండ చిలువ ఎంత వేగంగా, ఎంత ఒడుపుగా చెట్టెక్కుతుందో చూస్తే మతిపోతుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ వివిధ రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా వైరల్ అయ్యేవి జంతు ప్రపంచానికి సంబంధించినవి. ఒక్కోసారి కామెడి, థ్రిల్లర్, స్కారీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాములకు సంబంధించిన వీడియోలయితే మరీ వేగంగా వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ఓ భారీ కొండచిలువ ఎంత వేగంగా నిటారుగా ఉన్న చెట్టును ఎక్కడం గమనించవచ్చు. వేగంగా చెట్టెక్కడమే కాకుండా చాలా ఒడుపుగా చెట్టెక్కే పద్దతి అందర్నీ ఆకట్టుకుంటోంది. అందుకే ఈ వీడియో వైరల్ అవుతోంది.
కొబ్బరి కాయలు చెట్టు నుంచి దింపే కార్మికులు ఎలా ఎక్కుతారో అచ్చం అలానే ఎక్కడం చూడవచ్చు. ముందు చెట్టుకు అల్లుకోవడం ఆ తరువాత పైకీ పాకి అల్లుకోవడం ఇలా ఒక్క ఉదుపుతో 2 అడుగులు పైకి ఎక్కడం గమనించవచ్చు. వేగంగా చెట్టెక్కడమే కాకుండా ఆ విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. అందుకే అంత వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి