రాజీనామా లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ !!

రాజీనామా వెనక్కి తీసుకునే విషయం రాజీపడబోనంటున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

Last Updated : Jul 3, 2019, 05:27 PM IST
రాజీనామా లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ !!

ఢిల్లీ: తన రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో రాజీపడబోమని తనను కలిసిన వారితో కుండబద్దలు కొట్టేలా చెబుతున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత పదవికి రిజైన్ చేసిన రాహుల్... తన రాజీనామా లేఖను నేరుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) కి ఇప్పటికే రాజీనామా సమర్పించారు. 

రాజీపడబోనంటున్న రాహుల్ !!

అయితే  సీడబ్ల్యూసీ రాహుల్ రాజీనామాను తిరస్కరించింది. రాహులే అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని తీర్మానించింది. అయినప్పటికీ రాహుల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాహుల్ గాంధీ రాజీనామాకు నిరసనగా దేశ వ్యాప్తంగా వందలాది మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేసి నిరసన తెలిపినప్పటికీ రాహుల్ మాత్రం రాజీనామా విషయంలో మెట్టు దిగడం లేదు. ఇప్పుడు తాజాగా తన రాజీనామా లేఖను ఏకంగా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంచలం సృష్టించారు.

ట్విట్టర్ లో రాహుల్ ఏమన్నారంటే... 

అద్భుతమైన భారత దేశానికి దిశ నిర్దేశం చేసి సుపరిపాలన అందించిన  కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నా. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాపై అపరిమితమైన ప్రేమ చూపిన దేశ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి  రుణపడి ఉంటానని పేర్కొన్నారు. చివరకి  జైహింద్’అంటూ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు రాహుల్  తన రాజీనామా లేఖను రాహుల్ జతచేశారు.

 

Trending News