Rahul Gandhi: కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన బర్త్ డే బాయ్ రాహుల్ గాంధీ.. మరోసారి పెళ్లిపై సరికొత్త చర్చ..

Rahul gandhi Shifted to new home: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన జన్మదిన వేడుకల వేళ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 19, 2025, 07:53 PM IST
  • కొత్తఇంటికి మారిన రాహుల్ గాంధీ..
  • ఇప్పుడైన గుడ్ చెప్పాలని అభిమానుల డిమాండ్ లు..
Rahul Gandhi: కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన బర్త్ డే బాయ్ రాహుల్ గాంధీ.. మరోసారి పెళ్లిపై సరికొత్త చర్చ..

Rahul Gandhi shifted to bungalow no 5 sunehri bagh: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాజాగా.. 55 వడిలో అడుగు పెట్టారు.ఈ క్రమంలో తమ అభిమాన నేత జన్మదిన వేడుకలు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.  ఈ నేపథ్యంలో ఆస్పత్రులలో పండ్లను పంపిణి చేశారు. పలు చోట్ల.. అన్నదానాలు నిర్వహించారు. గుళ్లలో రాహుల్ గాంధీ పేరిట పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన బర్త్ డే వేళ కొత్త ఇంటికి వెళ్లడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Add Zee News as a Preferred Source

పార్లమెంట్ వర్గాలు రాహుల్ గాంధీకి ఢిల్లీలోని  సున్ హరీ బాగ్ రోడ్డులోని బంగ్లా నంబర్ 5 ను కేటాయించాయి. అయితే.. జులై 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త భవనంలోకి మారనున్నారు. తన జన్మదినం వేళ ఇప్పటికైతే కొన్నిసామానులను రాహుల్ గాంధీ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ చేశారు.

అయితే.. గతంలో రాహుల్ గాంధీ.. నంబర్ 12 తుగ్లక్ లేన్ లో ఉండే వారు. పరువు నష్టం కేసులో దోషిగా తెలడంతో.. 2023 లో లోక్ సభకు అర్హత కోల్పోయారు. దీంతో ఆయన తన నివాసంను ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి తన తల్లి సోనియా గాంధీతో కలిసి 10 జన్ పథ్ లో ఉంటున్నారు. ఇటీవల  మరల లోక్ సభ ఎన్నికలో అపోసిషన్ పార్టీ నేతగా ఎంపికయ్యారు.

దీంతో క్యాబెనెట్ హోదాతోపాటు,   టైప్ 8 బంగ్లాలో ఉండే అర్హత సాధించారు.  ఈక్రమంలో పార్లమెంట్ వర్గాలు ఆయనకు ఈ భవనంను కేటాయించాయి. మరోవైపు సోనియా గాంధీ సైతం.. సర్ గంగారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read more: Hanuman Chalisa in Flight Video: ఇంటర్నేషనల్ విమానంలో అద్భుతం... సాముహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న ప్రయాణికులు.. వీడియో ఇదే..

రెండు రోజుల క్రితం కడుపునొప్పితో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం సోనియా గాంధీ యాక్టివ్ గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పెళ్లి  ఇంకా ఎప్పుడు చేసుకుంటారని.. మరల నెట్టింట ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పెళ్లిపై తమకు తోచిన విధంగా చర్చలు  చేసుకుంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News