)
Rahul Gnadhi: పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధవాతావరణం.. దేశీయంగా పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ చెప్పినవి మార్గదర్శకాలు కావని.. అవి ప్రభుత్వం 14ఏళ్ల వైఫల్యాలకు నిదర్శనమంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ మారక ద్రవ్యంపై పడుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. దీనిలో భాగంగానే ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని.. పెట్రోల్ వాడకం తగ్గించాలని.. వీలైనంత ఇంటి నుంచే పనిచేయాలని ప్రధాని సూచించారు. దేశ ప్రయోజనాల ద్రుష్ట్యా ప్రజలు ఈ త్యాగాలు చేయాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మోదీపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. నిన్నమోదీగారు ప్రజలను త్యాగం చేయమని కోరారు. బంగారం కొనకూడదు..విదేశాలకు వెళ్లకూడదు.. పెట్రోల్ తక్కువగానే వాడుకోండి.. వంట నూనె ఎంతతగ్గిస్తే అంతే మంచిది..ఇవే ప్రబోధాలు..ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యాలే అంటూ రాహుల్ పేర్కొన్నారు.
12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత దేశాన్ని మోదీ ఎలాంటి స్థితికి తీసుకువచ్చారంటే.. ప్రజలు ఏం కొనాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏం తినాలి అనేది కూడా ప్రభుత్వమే నిర్ణయించే స్థాయికి దిగజారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి ప్రధానికి ఇక లేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రజలను త్యాగాలు చేయమని అడుగుతున్నారు అని రాహుల్ దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, ప్రధాని స్వయంగా వంట నూనె, పెట్రోల్ వాడకం తగ్గించాలని చెప్పడం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం ప్రధాని ఈ పిలుపునిచ్చినప్పటికీ, రాహుల్ గాంధీ దీనిని సామాన్యుడి స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు.
मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।
ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।
12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न…
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026
హైదరాబాద్ వేదికగా మోదీ చేసిన 7 విజ్ఞప్తులు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణ అని ప్రభుత్వం అంటుంటే, మరోవైపు ఇది అసమర్థ పాలన అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook