Rail Ticket Confirm: రైల్లో మీ టికెట్ కన్ఫామ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. సుఖంగా ప్రయాణించండి..

Train Ticket Confirm: మీరు తరుచుగా రైల్లో ప్రయాణిస్తున్నారా.. అపుడపుడు టికెట్ కన్ఫామ్ కాకుండా మిమ్మల్ని చికాకు పెడుతుంటాయా.. అయితే.. మీ కోసమే ఈ సమాచారం.  మీరు చేయాలనుకున్న రైలు  ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా మీ పయనం సాగాలంటే మీరు ఈ APP ద్వారా బుక్ చేసుకోండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 3, 2025, 12:54 PM IST
 Rail Ticket Confirm: రైల్లో మీ టికెట్ కన్ఫామ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..  సుఖంగా ప్రయాణించండి..

Train Ticket Confirm: ప్రయాణికుల సౌకర్యార్ధం మేక్‌మైట్రిప్ సీట్ అవేలయబిలిటీ ఫోర్‌కాస్ట్ అనే కొత్త  ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ట్రైయిన్ సీట్లు ఎన్ని రోజుల ముందుగా పూర్తిగా బుక్ అవుతాయి. ఈ రైలులో టిక్కెట్లు ఎంతకాలం అందుబాటులో ఉంటాయనే  సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ లక్ష్యం ప్రయాణికులు వారి ప్రయాణాన్ని సకాలంలో ప్లాన్ చేసుకోవడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ కు చెక్ పెట్టవచ్చు.  మేక్‌ మై ట్రిప్ ప్రకారం, దానిని యూజ్ చేసే వినియోగదారులలో దాదాపు 40% మంది రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ యాప్ ను  వెబ్‌సైట్‌ను సందర్శిస్తారని చెబుతుంది. ఈ వినియోగదారులలో దాదాపు 70 శాతం మంది వెయిటింగ్ టిక్కెట్లను కొనుగోలు చేస్తారు.ఎందుకంటే వారు తమ ప్రయాణ సమయంలో కన్ఫామ్ టికెట్స్ అందుబాటులో ఉండవు కాబట్టి. 

Add Zee News as a Preferred Source

భారతదేశంలో రైలు టిక్కెట్లను ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. గతంలో 4 నెలల ముందు వరకు టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. దాన్ని భారతీయ రైల్వేలు రద్దు చేసింది.  చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొన్ని రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. దీని కారణంగా, సీటు ఎంతకాలం అందుబాటులో ఉంటుందో వారికి తెలియదు.  

ఉదాహరణకు, ఏప్రిల్‌లో, అనేక హై-స్పీడ్ రైళ్లు ప్రయాణ తేదీకి 13 రోజుల ముందు పూర్తిగా బుక్ అవుతుంటాయి.  కానీ మే నెలలో, ప్రయాణ డిమాండ్  పెరిగినప్పుడు, అదే రైళ్లు 20 రోజుల ముందు పూర్తిగా బుక్ అయిపోతాయి.  దీనివల్ల ప్రయాణికులు ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం కష్టమవుతుంది.  ఎందుకంటే సీట్లు ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాయో వారికి అంతగా అవగాహన ఉండదు.  

ఈ సమస్యను అధిగమించడానికి, మేక్‌మైట్రిప్ తన యాప్, దానికి సంబంధించిన వెబ్‌సైట్ రెండింటిలోనూ ఈ కొత్త సీట్ల లభ్యతకు సంబంధించిన ఫీచర్‌ను జోడించింది.ఈ ఫీచర్ ఇప్పుడు రైలు బుకింగ్ సమయంలో నేరుగా కనిపిస్తుంది.

భారతీయ రైల్వే ప్రయాణీకుల అవసరాలను ముందుగానే అర్థం చేసుకోని దానికి సంబంధించిన  పరిష్కారాలను అందించడానికి కంపెనీ కట్టుబడి ఉందని మేక్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ CEO రాజేష్ మాగో అన్నారు. ఈ కొత్త ఫీచర్ డేటా సైన్స్ ఆధారంగా పనిచేస్తుందని చెప్పారు.  ప్రయాణీకులకు వారి రైలు బుకింగ్‌లను ప్లాన్ చేసేటప్పుడు మరింత స్పష్టత క్లారిటీతో  అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కొత్త యాప్  ప్రయాణీకులకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుందని చెప్పారు.  అంతేకాదు ప్రయాణ సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుందన్నారు.

మొత్తంమీద, ఈ కొత్త ఫీచర్  చివరి నిమిషంలో రైళ్లను బుక్ చేసుకునే వారికి ఎంతో యూజ్ ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పుడు వారికి సీట్లు ఎంతకాలం ఖాళీగా ఉంటాయి. ఎప్పుడు బుక్ చేసుకోవాలో ముందుగానే ఒక ఆలోచనకు వస్తారు. 

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News