Bank Account Rules: బ్యాంక్ ఎక్కౌంట్ అనేది చాలా సాధారణమైపోయింది. కానీ మైనర్లు సొంతంగా బ్యాంకు ఎక్కౌంట్ నిర్వహించుకోలేరు. 18 ఏళ్లు నిండే వరకు బ్యాంక్ ఎక్కౌంట్ తల్లిదండ్రుల ప్యవేక్షణలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఈ నిబంధన మార్చింది. బ్యాంక్ ఎక్కౌంట్ సొంతంగా నిర్వహించేందుకు 18 ఏళ్ల వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు.
ఇప్పటి వరకూ ఆర్బీఐ వివిధ బ్యాంకులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగినవారికి బ్యాంక్ ఎక్కౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు గానీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటుంది. 18 ఏళ్లు నిండే వరకు చెక్ బుక్ ఫెసిలిటీ లేదా ఏటీఎం కార్డు అనేవి జారీ కావు. బ్యాంక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా ఉండదు. అంటే 18 ఏళ్లు వచ్చేవరకు యూపీఐ లావాదేవీలు కూడా చేయలేరు. డబ్బులు కావాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి వోచర్ సైన్ చేసి తీసుకోవాల్సిందే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనల్లో మార్పు చేసింది. 18 ఏళ్ల నిబంధనను తొలగించింది. ఇకపై పదేళ్లు దాటితే చాలు సొంతంగా ఎక్కౌంట్ మెయింటైన్ చేసుకోవచ్చు.
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు రిస్క్ మేనేజ్‌మెంట్ పాలసీ ప్రకారం సొంతంగా నిబంధనలు విధించుకోవచ్చు. పదేళ్లు దాటితే చాలు సేవింగ్ ఎక్కౌంట్ లేదా పిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు. మైనర్లు మేజర్ అయ్యేంతవరకు శాంపిల్ సంతకం బ్యాంకు రికార్డుల్లో భద్రపరుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పదేళ్లు దాటితే చాలు బ్యాంకింగ్, ఏటీఎం డెబిట్ కార్డులు, చెక్ బుక్ వంటి సదుపాయాలు ఉచితంగా అందుతాయి. అయితే సేవింగ్ ఎక్కౌంట్‌లో ఎప్పుడూ డబ్బులు ఉండేలా చూసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది జూలై 1 నాటికి అమల్లోకి రానున్నాయి.
Also read: TS Inter Results 2025 Out: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, మరోసారి బాలికలే టాప్, సప్లిమెంటరీ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









