Best Voice Only Plans: టెలీకం కంపెనీల వ్యూహంలో చిక్కుకున్న కస్టమర్లు ట్రాయ్ ఆదేశాలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. అవసరం లేకపోయినా డేటాతో కూడిన ప్లాన్స్ వల్ల జేబులు గుల్లయిపోయేవి. ఇప్పుడు డేటా అవసరం లేకపోతే కేవలం వాయిస్ కాలింగ్ కోసం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ డేటా లేనప్పుడు బ్యాలెన్స్ ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేసకునే వెసులుబాటు యూజర్లకు ఉండేది. ఆ తరువాత అన్‌లిమిటెడ్ కాలింగ్ పేరుతో డేటాను అవసరం ఉన్నా లేకపోయినా యూజర్ల నెత్తిపై రుద్దడం మొదలెట్టాయి టెలీకం కంపెనీలు. అలా డేటా అలవాటు చేసిన తరువాత టారిఫ్ రేట్లు అమాంతం పెంచేశాయి. డేటా అవసరం లేకపోయినా వాయిస్ కాల్స్ అవసరం ఉండటంతో తప్పని పరస్థితుల్లో టారిఫ్ రేట్లు పెరిగినా భరించాల్సి వచ్చేది. యూజర్లకు జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని టెలీకం కంపెనీలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. డేటా లేకుండా కేవలం వాయిస్ కాలింగ్ , ఎస్ఎంఎస్ ప్లాన్స్ యూజర్లకు అందుబాటులో ఉంచాలని ట్రాయ్ ఆదేశించింది. దాంతో తప్పని పరిస్థితుల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోఢాఫోన్ ఐడియాలు వాయిస్ కాలింగ్ ప్లాన్స్ తీసుకొచ్చాయి. వీటిలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా అందిస్తున్న రెండు ప్రాన్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. ఈ ప్లాన్స్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు.
ఎయిర్‌టెల్ 469, 1849 రూపాయల రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. దాంతో పాటు మొత్తం 900 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అదే 1849 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రెండు ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.
రిలయన్స్ జియోలో 448 రూపాయలకే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఇక మరో ప్లాన్ 1748 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.
ఇక వోడాఫోన్ ఐడియాలో 470 రోజులకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇందులోనే 1849 రూపాయల ప్లాన్ తీసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది.
Also read: JEE Main 2025 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 షెడ్యూల్ ఇదిగో, పరీక్షలు ఎప్పుడెప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









