Jio Free Offers: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంటుంది. కారణం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఫ్రీ ఆఫర్లతో యూజర్లను నిలబెట్టుకోవడమే కాకుండా కొత్త యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా 50 రోజులు ఫ్రీగా జియో హాట్‌స్టార్ వీక్షించవచ్చు.
జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం తరువాత జియో యూజర్లకు పండగే పండగ. అత్యధికంగా సబ్‌స్క్రైబర్లు కలిగిన హాట్‌స్టార్ ఉచితంగా వీక్షించే అవకాశం కలుగుతోంది. జియో ఇప్పుడు కొత్తగా అన్‌లిమిటెడ్ ఆఫర్ ప్రకటించింది. 50 రోజుల పాటు ఉచితంగా హాట్‌స్టార్ వీక్షించే అవకాశం కల్పిస్తోంది. జియో అందిస్తున్న ఈ అన్‌లిమిటెడ్ ఆఫర్ కేవలం 299 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. అంతకంటే ఎక్కువ టారిఫ్‌తో కూడా వర్తిస్తుంది. ఈ ఆఫర్ లో భాగంగా అన్‌లిమిటెడ్ 5జి సేవలు లభిస్తాయి. 90 రోజులు అంటే మూడు నెలలు ఉచితంగా జియో హాట్ స్టార్ వీక్షించవచ్చు. దీనిని మొబైల్ లేదా టీవీ రెండింట్లో చూసేందుకు వీలుంటుంది. మరోవైపు 50 రోజుల ఉచిత జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ ట్రయల్ కూడా లభిస్తుంది.
ఈ ఆఫర్ ప్రయోజనాలు ఇంతటితో పూర్తి కాలేదు. 4కే క్వాలిటీతో జియో హాట్‌స్టార్ చూడవచ్చు. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్, 11 కంటే ఎక్కువ ఓటీటీ యాప్స్, 50 రోజుల అన్‌లిమిటెడ్ వైఫై సేవలు పొందవచ్చు. ఈ ఆఫర్‌కు వాస్తవానికి ఇవాళ చివరి రోజు. ఇవాళ ఈ ఆఫర్ పొందలేకపోయినా ఫరవాలేదు. కేవలం 100 రూపాయలకు 3 నెలలు జియో హాట్‌స్టార్ ఉచితంగా వీక్షించవచ్చు.
Also read: Supreme Court on Wakf: వక్ఫ్ భూముల డీ నోటిఫై వద్దు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









