Jio Best Recharge Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో ఒకటైన జియో నుంచి అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధర నుంచి అత్యధిక ధర వరకూ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు అతి తక్కువ ధరలో ఏకంగా ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
రిలయన్స్ జియో అత్యంత తక్కువ ధరకు అత్యధిక వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ టారిఫ్ 601 రూపాయలు మాత్రమే. అయితే వ్యాలిడిటీ మాత్రం ఏకంగా ఏడాది ఉంటుంది. నాన్ 5జి ప్లాన్ ను ఏడాది కోసం అన్ లిమిటెడ్ ప్లాన్ కు అప్ గ్రేడ్ చేయవచ్చు. ఈ వోచర్ ను జియో నెంబర్ కు బహుమతిగా ఇవ్వవచ్చు. 1.5 జీబీ డేటాతో యాక్టివ్ ప్లాన్ కలిగి ఉండాలి. అప్పుడు ఈ వోచర్ ఎవరికైనా గిఫ్ట్ కింద అందించవచ్చు.
జియో 5జి వోచర్ 199 రూపాయల ప్లాన్ తో పనిచేస్తుంది. ఇందులో ఇంకా 239, 299, 319, 329, 579, 666, 769, 899 రూపాయల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వోచర్ యాక్టివేట్ చేయాలంటే మీ ప్రస్తుత ప్లాన్ యాక్టివేట్ అయి ఉండాలి. ఒకవేళ మీరు రోజుకు 1.5 జీబీ డేటా ప్లాన్ తీసుకుని 1899 ఏడాది ప్లాన్ కలిగి ఉంటే మాత్రం 601 రూపాయల వోచర్ పనిచేయదు. మొత్తం 12 వోచర్ లు లభిస్తాయి. ఇందులో ప్రతి నెలా ఒక వోచర్ ఉంటుంది. ఒక్కొక్క వోచర్ 30 రోజులు పనిచేస్తుంది.
Also read: AP Fibernet Issue: కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్, అందరికీ ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









