Jio New Plan: 195 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ ఉచితం

Jio New Plan: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తుంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు మరో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2025, 03:12 PM IST
Jio New Plan: 195 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ ఉచితం

Jio New Plan: ట్రాయ్ ఆదేశాల ప్రకారం టెలీకం కంపెనీలు ఓన్లీ వాయిస్ కాలింగ్, డేటా ప్లాన్స్ అందిస్తున్నాయి. ఇందులో భాగంగా జియో కొత్తగా లాంగ్ వ్యాలిడిటీతో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం 195 రూపాయలకే మూడు నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తుంది. 

Add Zee News as a Preferred Source

జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం తరువాత జియో హాట్‌స్టార్ కొత్త ఓటీటీ ఏర్పడింది. దాంతో జియో హాట్‌స్టార్ ఓటీటీ సేవల్ని రిలయన్స్ జియో ప్లాన్స్‌తో పాటు అందుతున్నాయి. మరో వైపు ట్రాయ్ ఆదేశాల మేరకు డేటా లేకుండా కేవలం వాయిస్ కాలింగ్, డేటా కాలింగ్ లభించే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా జియో కొత్తగా 195 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇదొక లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్‌తో ఏకంగా 90 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తం 3 నెలలకు 15 జీబీ డేటా కూడా ఉంటుంది. అత్యవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు. డేటాతో పెద్దగా అవసరం లేనివారికి ఈ ప్లాన్ చాలా అద్భుతమైంది. అన్నింటికీ మించి ఈ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఇది కేవలం డేటా ప్లాన్ కానీ 90 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. క్రికెట్ ప్రేమికులకు బెస్ట్ ప్లాన్ ఇది. 

మూడు నెలల వ్యాలిడిటీతో పాటు మూడు నెలలు జియో హాట్‌స్టార్ ఉచితంగా అందుతుంది. అయితే ఈ ప్లాన్‌తో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ఉండవు. జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలు ఉంటుంది. మై జియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ లేదా రిటైలర్స్  ద్వారా ఈ ప్లాన్ పొందవచ్చు. ఇతర రీఛార్జ్ వేదికల్లో కూడా లభిస్తుంది. క్రికెట్ ప్రేమికులకు ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అవుతుంది. ఎందుకంటే మూడు నెలల ఫ్రీ సబ్స్క్రిప్షన్ అందుతుంది. 15 జీబీ డేటా అయిపోతే యాడ్ ఆన్ డేటా ఉంటుంది. 

ఇక 949 రూపాయల మరో రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో హాట్‌స్టార్ మొబైల్ వెర్షన్ 84 రోజులు ఉచితంగా లభిస్తుంది. 

Also read: Champions Trophy 2025: ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్, విజయావకాశాలు అంచనాలు>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News