Jio Recharge plans: 28 రోజుల వ్యాలిడిటీతో జియో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ మీ కోసం

Jio Recharge plans: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తోంది. అందుకే చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్‌తో బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ ఎదురౌతున్నా యూజర్లు నిలబెట్టుకోగలుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2025, 05:05 PM IST
Jio Recharge plans: 28 రోజుల వ్యాలిడిటీతో జియో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ మీ కోసం

Jio Recharge plans: దేశంలో రిలయన్స్ జియోతో పాటు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ఉన్నాయి. ఈ మూడింటికి పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉంది. అయితే చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ ద్వారా రిలయన్స్ జియో ఇప్పటికీ అగ్రగామిగా ఉంటోంది. ఈ క్రమంలో రిలయన్స్ జియో అందిస్తున్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

రిలయన్స్ జియో డేటా, వాయిస్ కాలింగ్ ప్లాన్స్ అతి తక్కువ ధరకు అందిస్తోంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా అందించే వివిధ రకాల ప్లాన్స్ అందుబాటులో తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అయితే కేవలం 150 రూపాయల కంటే తక్కువకే లభించనుంది. జియో అందిస్తున్న 5 రకాల చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. జియో 75, 91, 125, 152 ప్లాన్స్ ఓసారి చెక్ చేద్దాం.

జియో 75 రూపాయల ప్లాన్

రిలయన్స్ జియోకు చెందిన ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. మొత్తం 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా పూర్తయితే 200 ఎంబీ డేటా అదనంగా వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, 50 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 

జియో 91 రూపాయల ప్లాన్

జియో 91 రూపాయల ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 3 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎంబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 200 ఎంబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 50 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. 

జియో 125 రూపాయల ప్లాన్

ఈ ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. మొత్తం 11.5 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 0.5 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి.

జియో 152 రూపాయల ప్లాన్

ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుంది. అంటే 28 రోజులకు కలిపి 14 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ ఎస్ఎంఎస్‌  సౌకర్యం వర్తిస్తుంది. జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి. 

Also read: Free Gas Cylinder Scheme: గుడ్‌న్యూస్, ఇక రెండో ఫ్రీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News