RBI Update: దేశంలో డీ లిమిటేషన్ పేరుతో 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత 2 వేల రూపాయల నోటు ప్రవేశపెట్టింది. మార్కెట్ అంతా 2 వేల రూపాయల నోట్లతో నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇస్తూ 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించింది.
2023 మే నెలలో మార్కెట్ నుంచి 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చుకునేందుకు కొంత గడువు ఇచ్చింది. రెండు మూడు సార్లు గడువు కూడా పొడిగించింది. దాంతో మార్కెట్ నుంచి 98.18 శాతం నోట్లు తిరిగొచ్చేశాయి. అయితే ఇంకా మార్కెట్‌లో అంటే ప్రజల వద్ద 1.82 శాతం 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. అంటే 6,741 కోట్లు మిగిలిపోయాయి. మే 19, 2023లో 2 వేల రూపాయల నోట్లు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిన తరువాత క్రమంగా 500 నోట్లకు బదిలీ అయ్యారు. 2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడేనాటికి మార్కెట్‌లో 3.56 లక్షల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. ఇటీవల అంటే 2025, ఫిబ్రవరి 28 నాటికి 1.11 లక్షల కోట్లకు పడిపోయింది. ఇప్పుడిది 6,471 కోట్లకు పడిపోయింది.
వాస్తవానికి 2023 అక్టోబర్ 7 వరకు దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఆ తరువాత ఈ సౌకర్యం కేవలం దేశంలోని 19 ప్రాంతీయ ఆర్బీఐ కార్యాలయాలకు పరిమితమైంది. అయితే సామాన్యుల సౌకర్యం కోసం ఇప్పటికీ 2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు కూడా ఎవరైనా 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవాల్సి వస్తే దేశంలోని ఏ పోస్టాఫీసు లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి 2 వేల రూపాయల నోట్లు ఇచ్చి ఆర్బీఐకు పంపించవచ్చు. అక్కడి నుంచి నేరుగా మీ బ్యాంకులోకి జమ చేయించుకోవచ్చు.
ఎవరి దగ్గరైనా 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోయుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమీపంలోని పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకు పంపించి మార్చుకోవచ్చు. ఇప్పటికీ 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి చివరి అవకాశం ఉంది.
Also read: Ind vs Aus Semifinal: ఆసీస్‌తో సెమీస్ సమరానికి సిద్ధం, దుబాయ్ పిచ్ రిపోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









