Banks Merger: దేశంలో మళ్లీ బ్యాంకుల విలీనం, తెలుగు రాష్ట్రాల్లో విలీనం కానున్న బ్యాంకులివే

Banks Merger: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. బ్యాంకుల విలీనానికి సంబంధించి అతి ముఖ్యమైన ప్రకటన ఇది. ఒకే రాష్ట్రం, ఒకే ఆర్ఆర్‌బి ప్రణాళిక సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2025, 10:23 PM IST
Banks Merger: దేశంలో మళ్లీ బ్యాంకుల విలీనం, తెలుగు రాష్ట్రాల్లో విలీనం కానున్న బ్యాంకులివే

Banks Merger: ఇటీవల జాతీయ బ్యాంకుల్ని విలీనం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మరో కీలకమైన చర్యకు ఉపక్రమించింది. ఈసారి 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసేందుకు సంకల్పించింది. ఒన్ స్టేట్ వన్ ఆర్ఆర్‌బి ప్రణాళికకు తెరలేపింది. ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. 

Add Zee News as a Preferred Source

ఆర్ఆర్‌బి ఇప్పుడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని కుదించే నిర్ణయం తీసుకుంది. ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్‌బి ప్రణాళికకు సిద్ధం చేసింది. దేశంలోని మొత్తం 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని 28కు కుదించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బ్యాంకుల విలీనానికి సంబంధించి పనులు పూర్తయ్యాయి. త్వరలో మొత్తం ప్రక్రియ పూర్తి కావచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఏపీలో 4 గ్రామీణ బ్యాంకులుంటే తెలంగాణలో 4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖల్ని తెలంగాణ బ్యాంకులో విలీనం చేశారు.

విలీనం కానున్న బ్యాంకుల్లో ఏపీ నుంచి 4 బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఇతర ఆర్‌ఆర్‌బి‌లను విలీనం చేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో 3 బ్యాంకులు, పశ్చిమ బెంగాల్‌లో 3 బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇక బీహార్, గుజరాత్, జమ్ము కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లో రెండేసి బ్యాంకులు విలీనం కానున్నాయి. 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 50 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంటే మరో 35 శాతం వాటా ప్రాయోజిత బ్యాంకుకు, ఇంకో 15 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది. 

Also read: Mamata Banerjee: సుప్రీంకోర్టు ఆదేశాలను మమతా బెనర్జీ ధిక్కరిస్తున్నారా, ఏం జరుగుతుంది

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News