Risky Childbirth In Maharashtra: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ప్రసవాన్ని కేవలం రూపాయి బ్లేడు, బాణాలు, ఇతర వెదురు కట్టెల సాయంతో చేసిన సంఘటన యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తల్లీ బిడ్డల మరణాలను ఆపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 'సురక్షిత మాతృత్వ యోజన' పథకాన్ని అమలు చేసినా ఇలాంటి ఘటన జరగడం పట్ల తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
గత ఏడాదిన్నర కాలంగా ఈ పథకానికి రూ. 771 కోట్లు ఖర్చు చేసినా.. ఆ డబ్బు ఎక్కడికి పోతుందని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడిదే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. సురక్షితమైన ప్రసవం గర్భిణీ స్త్రీ హక్కు. దీనికి బాధ్యత ప్రభుత్వం, ఆరోగ్య శాఖపై ఉంది. కానీ నేటికీ, ప్రసవ సమయంలో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని తెలుస్తోంది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో కూడా, ప్రసవం ఇప్పటికీ చాలా ప్రాణాంతక రీతిలో జరుగుతోంది. అందుకు సాక్ష్యం ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటనే.
అసలు విషయం ఏమిటి?
మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని సత్పురా పర్వతాల లోయల్లో నివసించే ప్రజలు ఇప్పటికీ ఆటవిక పద్ధతులను అనుసరిస్తున్నారు. మహిళ ప్రసవానికి బాణాలు, బ్లేడులు,వెదురు కర్రలను ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ పద్ధతిని వారు గత తమ నాలుగు తరాలుగా పాటిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. అవసరమైన వైద్య సౌకర్యాలు, స్టెరైల్ పరికరాలు, శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు లేనప్పుడు.. మహిళలు వారి ప్రసవాల సమయంలో నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సంస్థాగత ప్రసూతి క్లెయిమ్‌లు తగ్గాయి
"మహారాష్ట్రలో సంస్థాగత ప్రసవ రేట్లు వేగంగా పెరిగాయి" అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ నిజానికి గిరిజన, మారుమూల ప్రాంతాలలో చాలా మంది గర్భిణీ స్త్రీలు ఇప్పటికీ ఇంట్లోనే, అసురక్షిత, అపరిశుభ్రమైన పరిస్థితులలో ప్రసవిస్తున్నారు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందనే నిజన్ని తెలుసుకోలేకపోతున్నారు.
ఆరోగ్య వ్యవస్థ ఏం చేస్తోంది?
ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం లేదనేది వాస్తవం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు, సరైన రోడ్లు లేవు.. కుగ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా కరవు అయ్యాయి. లేదంటే ఇప్పటికే ఏర్పాటు చేసిన కేంద్రాలు అనేక కారణాల చేత ముసివేతకు గురయ్యాయి. కనీసం అంబులెన్స్ వెళ్లేంత అనుకూలమైన మార్గాలు కూడా ఉండడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల వాళ్లు ప్రాణాలను పణంగా పెట్టి, వాగులు వంకలు దాటుకుంటూ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలివెళ్లిన సంఘటనలు అనేకం చూశాం. మహిళలు కూడా వారి ప్రాణాలను పణంగా పెట్టి కొందరు ఇంటి వద్దే కాన్పులు చేయిస్తున్నారు. ఈ ఆటవిక పద్ధతి తప్పకుండా మారాల్సిన అవసరం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









