Road Accident In Arunachal Pradesh: ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. కార్మికులను తీసుకెళ్తున్న ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయి కొండపై నుంచి లోతైన లోయలో పడిపోవడం వల్ల ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 22 మంది కార్మికులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంజా జిల్లాలోని చాగ్లగాం ప్రాంతం (హైలాంగ్-చాగ్లఘం రోడ్డులోని మెటెంగ్లియాంగ్ సమీపంలో) ఈ ప్రమాదం జరిగింది. మరణించిన 22 మంది కార్మికులలో 19 మంది అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని గిలాపుకురి టీ ఎస్టేట్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒక కాంట్రాక్టు పని కోసం అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాజెక్ట్ సైట్‌కు వెళుతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: Pini Village Women: ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు..భారత్‌లోనే వింతైన గ్రామం..ఎక్కడుందో తెలుసా?
ప్రమాద కారణం ఏమిటంటే?
ప్రమాదం జరిగిన రోడ్డు ప్రయాణానికి అనువుగా లేదు. చాలా ప్రమాదకరమైన రీతిలో ఉంది. ఇరుకైన మలుపులు, నిటారుగా దిగులు, లోతైన లోయలు ఈ మార్గంలో తరచుగా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
మృతదేహాల వెలికితీత..
ఇప్పటివరకు 19 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మరణించిన వారిలో 19 మంది వివరాలను తెలుసుకోగా.. మరో ముగ్గుర్ని ఇంకా గుర్తించాల్సి ఉందట. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. వెలికితీసిన మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతం ఇండో-చైనా సరిహద్దు వెంబడి ఉండటం వల్ల.. ఇక్కడ రోడ్డు ప్రాజెక్టులలో పనిచేసే కార్మికులు తరచుగా వాతావరణ మార్పులు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ విషాధ ఘటనపై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు ముమ్మరంగా జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









