)
Rrb Ntpc Admit Card Download: నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ సెకండ్ ఎగ్జామ్ డేట్ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో అనగా అక్టోబర్ 13, 2025న CBT-II ఎగ్జామ్ జరుగనుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కి బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
అక్టోబర్ 13న పరీక్ష..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరగనున్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ సెకండ్ ఎగ్జామ్ డేట్ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రిలీజ్ చేసింది. CBT-II పరీక్ష అక్టోబర్ 13, 2025న జరుగనుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం బోర్డు అధికారిక వెబ్సైట్ rrbcd.gov.inలో పూర్తి డీటెయిల్స్ చెక్ చేయొచ్చు.
అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలంటే..
ఎగ్జామ్ సెంటర్, తదితర వివరాలను ఇప్పటికే అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. పరీక్షకు 4 రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో కాల్ లెటర్/ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్, CBT-II అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి.. ముందుగా అధికారిక వెబ్సైట్ rrbcd.gov.in కి వెళ్లాలి. మొదట హోమ్ పేజీలో RRB NTPC CBT-II Tentative Schedule 2025 పై క్లిక్ చేయాలి. అంతే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
ఆధార్ కార్డు మస్ట్..
అభ్యర్థులు తమ ఆధార్ కార్డును పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎందుకంటే అది లేకుండా వారిని లోపలికి అనుమతించరు. వివిధ జోన్లలో మొత్తం 11,558 ఉద్యోగాల భర్తీకి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.