)
RRB NTPC Notification 2025: ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరంతరం కష్టపడుతున్న నిరుద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 5 వేల 810 పోస్టులకు.. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్)లకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. అప్లయ్ చేసుకోడానికి నవంబర్ 20 చివరి తేదీ.
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు..
కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్-161
స్టేషన్ మాస్టర్-615
గూడ్స్ రైల్ మేనేజర్-3,416
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-638
ట్రాఫిక్ అసిస్టెంట్-59
విద్యార్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్/ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ పాసై ఉండాలి. అడిషినల్‌గా కంప్యూటర్లో ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ స్కిల్ మస్ట్‌గా ఉండాలి.
ఏజ్ లిమిట్..
ఇక అభ్యర్థుల వయసు జనవరి 01, 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు.
దరఖాస్తు ఫీజు ఎంతంటే..
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 500 కాగా.. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 250గా ఉంది.
వేతన వివరాలు..
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు నెలకు రూ.35,400 కాగా.. ట్రాఫిక్ అసిస్టెంట్‌కు రూ.25,500, ఇతర పోస్టులకు రూ.29,200గా ఉంది.
ఎంపిక విధానం..
ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు టైర్-1, టైర్-2.. రెండు దశల్లో జరుగుతాయి. తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీని తర్వాత ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు.
రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు..
సికింద్రాబాద్-396, అహ్మదాబాద్-79, అజ్మీర్-345, బెంగళూరు-241, భువనేశ్వర్-231, బిలాస్పూర్-864, చండీగఢ్-199, చెన్నై-187, గౌహతి-56, గోరఖ్‌పూర్-111, జమ్మూ శ్రీనగర్-32, కోల్‌కతా-685, మాల్దా-522, ముంబై-596, ముజఫర్‌పూర్-21, పట్నా-23, ప్రయాగ్‌రాజ్-110, రాంచీ-651, సిలిగురి-21, తిరువనంతపురం-58.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook