Fuel Shortage Rumours: భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ ప్రజలను ఒక వార్త భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రానుందనే పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా ఇంధన వనరులు కొరతగా ఉన్నాయనే వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో వాహనదారులు భయాందోళనతో పెట్రోల్ పంపులకు బారులు తీరుతున్నారు. అయితే దీనిపై ఇంధన సంస్థలు కీలక ప్రకటన చేశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: India Pak War: పాకిస్థాన్‌కు మద్దతుగా యువతి పోస్టులు.. హైదరాబాద్‌లో తీవ్ర కలకలం
పాకిస్థాన్‌తో వివాదం కొనసాగుతున్న వేళ దేశంలో కొన్ని అవాస్తవాలు.. పుకార్లు కలకలం రేపుతున్నాయి. దేశంలో ప్రజలను బెంబేలెత్తించడం.. వారిని భయాందోళనకు గురి చేసేలా కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం నెలకొన్న తీవ్ర దాడుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎల్పీజీ, సీఎన్‌జీ వంటి ఇంధన వనరులు కొరత ఉన్నాయనే పుకార్లు కలకలం రేపుతున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని దుష్ప్రచారం జరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇది వాస్తవం అని తెలుసుకుని పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌లకు బారులు తీరుతున్నారు. ఇక ఎల్పీజీ గ్యాస్ ఉన్నా కూడా బుక్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్‌లకు వాహనదారులు బారులు తీరగా.. గ్యాస్ బుకింగ్‌లు పెరిగాయి.
Also Read: Shehbaz Sharif: భారత్ బాంబుల మోత.. దెబ్బకు బంకర్‌లో దాక్కున్న పాకిస్థాన్ ప్రధాని
ఈ వార్తలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తుండడంతో వెంటనే చమురు సంస్థలు స్పందించాయి. ఇండియన్ ఆయిల్‌తోపాటు భారత్ పెట్రోలియం సంస్థలు స్పందించాయి. ఇంధన వనరుల కొరత ఉందనే వస్తున్న వార్తలను కొట్టిపారేశాయి. అవన్నీ పుకార్లేనని.. వాస్తవం కాదని స్పష్టం చేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పందిస్తూ.. 'ఇంధన నిల్వల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి' అని ప్రకటించింది. సరఫరా లైన్లు సక్రమంగా పని చేస్తున్నాయని.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది. 'పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ అన్ని ఔట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి' అని సూచించింది.
సరిపడా నిల్వలు
'ఎలాంటి రద్దీ లేకుండా బంక్‌లలో సత్వరమే ఇంధన వనరులు అందిస్తాం' అని ఇండియన్ ఆయిల్ తెలిపింది. భారత్ పెట్రోలియం కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎలాంటి కొరత లేదని.. సరిపడా నిల్వలు ఉన్నాయని బీపీసీఎల్ వెల్లడించింది. వాస్తవ పరిస్థితిని చమురు సంస్థలు ప్రకటించడంతో ప్రజలు ఊరట చెందారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ఇలాంటి పుకార్లు సృష్టించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









