)
Sabarimala Devotees Brain Fever Alert: శబరిమలకు ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతూ ఉంటారు. అక్కడ స్వామివారికి ఇరుముళ్లు సమర్పించుకుంటారు. అయితే ఆరోగ్యశాఖ కీలక సూచన చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నది స్నానం చేసేటప్పుడు అమీబిక్ మెనింజో ఎన్సైలిటీస్ అనే బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ సమయంలో ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు భక్తులు కేవలం వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అని కూడా సూచించారు. ఇక అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ నెంబర్ 04735203232 నెంబర్లకు కాల్ చేయాలని కూడా చెప్పారు.
శబరిమలకు పెద్ద ఎత్తున డిసెంబర్ జనవరి నెలలో భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వెళ్తారు. 41 రోజులు దీక్ష తీసుకొని ఆ స్వామివారికి ఇరుముళ్లు సమర్పించడానికి కూడా వెళ్తారు. మండల పూజ నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇక డిసెంబర్ 27 నాటికి ఇది పూర్తవుతుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసేసి మళ్లీ జనవరి మొదటి వారంలో తిరిగి భక్తుల కోసం అనుమతిస్తారు. మకర సంక్రమం సమయంలో జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు తిరిగి వెళ్తారు.
అయితే స్నానం చేసే నది స్నానం చేసే భక్తులకు ఆరోగ్య శాఖ కీలక సూచన చేసింది. ఇప్పటివరకు 19 మంది కేరళవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు.అమీబిక్ మెనింజో ఎన్సైలిటీస్ అనే మెదడు తినే ఒక వైరస్ వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య పెరిగింది. వారు అందరూ దీనికి బాధితులు అవుతున్నారు. మొత్తంగా 19 మంది ఇదివరకు చనిపోయారు. కొంతమంది స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసిన వాళ్ళు కూడా దీని బారిన పడ్డారు.
ప్రధానంగా మెదడును తినే పిలిచే ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సైలిటీస్ అనే వ్యాధి కేరళ వ్యాప్తంగా వణికిస్తోంది. ఇది నిల్వ ఉన్న నీటి కుంటల్లో, పశువులను శుభ్రం చేసే జలాశయాల్లో ఉంటుంది. నిల్వ ఉన్న నీటిలో మురికికుంటల్లో వెళ్ళినప్పుడు ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. క్లోరినేషన్ చేయడం ఎంతో మంచిది. ఇది ముక్కు, చెవుల ద్వారా వ్యాపిస్తుంది. అక్కడ స్విమ్మింగ్ పూల వల్ల కూడా వ్యాపించింది. ఈ నేపథ్యంలో శబరిమల వెళ్లి అది స్నానం చేసే భక్తులకు ఆరోగ్యశాఖ ఈ కీలక సూచన చేసింది. ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఈ వైరస్ మెదడు కణాలను దెబ్బతీసి తీవ్రమైన వాపును కలిగించే అది చివరకు మరణానికి దారితీస్తుంది.
ఈ వ్యాధి లక్షణం మెదడులోకి ప్రవేశించగానే తలనొప్పి, వాంతులు, వికారం, మూర్చ వంటివి కనిపిస్తాయి. వెంటనే సరైన చికిత్స అందిస్తే చనిపోయే ప్రమాదం ఉండదు. యాంటీబయోటిక్ మందులు సూచిస్తారు. ఇక 2016 లోనే ఈ కేసులను కేరళలోని వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా 19 మంది ఈ మెదడు తినే అమీబా బారిన పడి చనిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook