Sahakar Taxi Cabs: ఆటో కార్ టాక్సీ డ్రైవర్లను లాభాల బాటలో తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలుపబోతోంది. అతి త్వరలోనే వారికోసం ట్యాక్సీ సర్వీస్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు త్వరలోనే ప్రకటించబోతోంది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ కీలక ప్రకటన కూడా చేశారు. అందరూ డ్రైవర్లకు లాభాలు చేకూరేలా కొత్త సహకార టాక్సీ పథకానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమల్లోకి వస్తే ఎంతోమంది డ్రైవర్లకు మేలు జరిగే అవకాశాలున్నాయి.. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారతదేశంలో అనేక ప్రసిద్ధ టాక్సీ యాప్‌లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఓలా, ఉబర్ చాలా ప్రత్యేకమైన భావించవచ్చు. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నివసించే చాలామంది రోజువారి రవాణా అవసరాల కోసం ఉబర్, ఓలా సేవలను వినియోగిస్తూ ఉంటారు. ఈ టాక్సీ ఆకుల ద్వారా వారికి నచ్చిన వాహనంలో గమ్యాన్ని చేరుకుంటారు. ఇందులో ఆటోలతోపాటు కార్లు, ద్విచక్ర వాహనాల వంటి రవాణా సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అతి త్వరలోనే ఉబర్ బస్సు సేవలను కూడా అందించబోతున్నట్లు ప్రకటించింది.
ఈ యాప్స్‌లో ట్రిప్స్ బుక్ చేసుకున్న ఐదు నుంచి పది నిమిషాల్లో వాహనం వారి దగ్గరికి చేరుకుంటుంది. అంతేకాకుండా జర్నీ టైం కూడా చాలా సేఫ్ అవుతుంది. అందుకే చాలామంది ఇప్పుడు ఈ టాక్సీ సేవలను ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ టాక్సీ యాప్ లో ఎవరు తక్కువ ధరలకు సేవలందిస్తే వారి యాపుల్లో మాత్రమే బుక్ చేసుకొని ప్రయాణం చేస్తున్నారు. అంతేకాకుండా ఆఫీసు సమయాల్లో, పండగ పూటల్లో ఈ టాక్సీ యాప్లు ప్రజల నుంచి అధిక డబ్బును వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే టెక్నికల్ లోపం వల్ల ఒక తారకు టాక్సీ బుక్ చేసుకుంటే.. రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మరో ధర వస్తోంది.. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఈ ట్యాక్సీ యాపుల ద్వారా ప్రయాణించేవారు ఎదుర్కొంటున్నారు..
సహకార టాక్సీ సర్వీస్..
ప్రైవేట్ టాక్సీ యాప్ లు భారీ మొత్తంలో జనాల నుంచి దోచుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. త్వరలోనే సహకార టాక్సీ సేవలను ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ప్రత్యేకమైన పథకం ద్వారా డ్రైవర్లు ప్రత్యక్షంగా ప్రయోజనాలు పొందే అద్భుతమైన అవకాశాన్ని కల్పించబోతున్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఈ అద్భుతమైన పథకాన్ని ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ వస్తోంది. అతి త్వరలోనే సహకా టాక్సీ పేరుతో కొత్త సేవలు ప్రారంభం అవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరిస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









