MLA Abu Azmi: ఔరంగజేబ్‌ గొప్పవాడంటూ ఎమ్మెల్యే ప్రశంసలు.. మహారాష్ట్రలో రాజుకున్న వివాదం..

Chhaava Movie: చావా సినిమాలో ఔరంగజేబ్‌ను కావాలని వక్రీకరించి చూపెట్టారని సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్యెల్యే అబూ ఆజ్మీ అన్నారు. కానీ ఆయన కూడా అనేక ఆలయాలను నిర్మించాడని అన్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 4, 2025, 05:00 PM IST
  • చావాపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
  • థానెలో కేసు నమోదు..
MLA Abu Azmi: ఔరంగజేబ్‌ గొప్పవాడంటూ ఎమ్మెల్యే ప్రశంసలు.. మహారాష్ట్రలో రాజుకున్న వివాదం..

Samajwadi party mla abu azmi controversial comments on chhaava: ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల చావా మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని విక్కీ కౌశల్‌, రష్మిక మందన జంటగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించారు. అయితే.. చావా మూవీలో స్వరాజ్యం కోసం శివాజీ మహారాజ్ ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ చేసిన త్యాగాలు, బలిదానాల గురించి గొప్పగా చూపించారు.

Add Zee News as a Preferred Source

ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఇలాంటి గొప్ప ధీరుడి గురించి తమ పుస్తకాలలో ఎందుకు పెట్టలేదని, చరిత్ర కారులు శంభాజీ త్యాగాన్ని తొక్కేశారని కూడా అనేక మంది సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. దీనిలో ఒకవైపు శంభాజీ మహారాజ్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ.. మరోవైపు ఔరంగాజేబ్‌ చేసిన దారుణాలపై చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

అయితే.. ఇటీవల  ఔరంగజేబ్‌పై ఎస్పీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ ఇటీవల  ప్రశంసలు కురిపిస్తు మాట్లాడారు. ఔరంగజేబ్‌ గొప్పవాడని.. ఔరంగజేబు పాలనలో భారతదేశ జిడిపి 24 శాతం ఉందని, అందుకే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారని అబు అజ్మీ కూడా అన్నారు.. అంతేకాకుండా.. మన దేశంలో అనేక ఆలయాలను ఆయన నిర్మించాడని కూడా అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా దుమారంగా మారాయి.

దీంతో  అబూ ఆజ్మీ దేశద్రోహి అని మహాయుతి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అనేక చోట్ల నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకొవడంతో.. సదరు  ఎస్పీ ఎమ్మెల్యేఅబూ ఆజ్మీ దిగొచ్చారు. వెంటనే సదరు నేతను పార్టీ నుంచి బహిష్కరించాలని నేతలు సైతం డిమాండ్ చేశారు.ఈ క్రమంలో ఎమ్మెల్యేఅబూ ఆజ్మీ తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

Read more: Viral Video: ఛావా థియేటర్‌లో షాకింగ్ ఘటన.. క్లైమాక్స్ చూసి వెకిలి చేష్టలు.. ఆ తర్వాత.. వీడియో వైరల్..

అందరి మనో భావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. అయితే... ఇప్పటికే దీనిపైన మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటనాయి.  ఛత్రపతి శివాజీని , ఛత్రపతి శంభాజీని తాను అవమానించే విధంగా మాట్లాడరని.. పలువురు.. అబూ ఆజ్మీపై మహారాష్ట్రలోని థానేతో పాటు పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో కేసులు కూడా నమోదయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News