Women Scheme: 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రారంభించనున్నారు ఈ పథకం. పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలందరూ అర్హులవుతారు. ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి మీరు అర్హులు అయితే ఈ పథకం ద్వారా మీరు లబ్ది పొందుతారు. ప్రతినెలా మీ ఖాతాలో ప్రతినెలా రూ.2500 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT)ద్వారా పొందుతారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది వైభవంగా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వేడుకలు నిర్వహిస్తోంది..
మహిళా సమృద్ధి యోజన పథకాన్ని బిజెపి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యంగా ఢిల్లీలోని మహిళలకు ఈ పథకం వర్తించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ మనోజ్ తివారి మీడియాతో చెప్పారు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. వారి ఖాతాల్లో ప్రతి నెల రూ.2500 జమ అవుతాయి. ఈ పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించనున్నారు అని చెప్పారు.
ఈ పథకానికి మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో ఆమె ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేఖ ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో బెనిఫిట్స్ మీరు కూడా పొందాలంటే కావాల్సిన పత్రాలు ఏంటో తెలుసుకుందాం.
ఆధార్ కార్డు, ఢిల్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయపు ధృవీకరణ పత్రం, ఆధార కార్డుతో లింక్ అయినా మొబైల్ నెంబర్.అయితే ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. వారి ఏడాది ఆదాయం మూడు లక్షల లోపు మాత్రమే ఉండాలి. మూడు లక్షలకు మించి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు. అంతేకాదు వీరు ఢిల్లీ శాశ్వత నివాసి అయి ఉండాలి ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు.
ఇదీ చదవండి: షాంపూ, నూనెలు కాదు.. ఇలా మసాజ్ చేసినా జుట్టు మోకాళ్ల వరకు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..
మహిళా సమృద్ధి యోజన రిజిస్ట్రేషన్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా 'ఇ- డిస్టిక్' పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి మీరు కావాల్సిన ధృవపత్రాలను కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి, చివరగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు. ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసే మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న మహిళలు కూడా ఈ సమృద్ధి యోజన పథకానికి అప్లై చేసుకోకూడదు.
ఇదీ చదవండి: పాపం.. బైకర్‌ను కాపాడబోయిన బస్సుకు చివరికి ఏం జరిగిందో చూడండి.. లైవ్ సీసీ ఫూటేజీ వీడియో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









