Jobs in Indian Post: బంపర్ రిక్రూట్ మెంట్.. పది పాస్ అయితే చాలు.. ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం మీదే

Indian Post Jobs:  మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతుంటే..మీకో అదిరిపోయే శుభవార్త.. గ్రామీణ డాక్ సేవక్ (GDS) రిక్రూట్‌మెంట్ 2025 కింద 21,413 పోస్టులకు పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)  పోస్టల్ సర్వెంట్ పోస్టులకు నియామకాలు జరుగుతాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Feb 24, 2025, 06:24 PM IST
Jobs in Indian Post: బంపర్ రిక్రూట్ మెంట్.. పది పాస్ అయితే చాలు.. ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం మీదే

Jobs in Indian Post: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయితున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్ మెంట్ 2025కింద దాదాపు 30వేల పోస్టులకు నోటిఫికేషన్ జానీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)  పోస్టల్ సర్వెంట్ పోస్టులకు నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 10 ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు indiapostgdsonline.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ద్వారా జరుగుతుంది. మీరు 10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు గొప్ప అవకాశం కావచ్చు.

Add Zee News as a Preferred Source

ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం: 10 ఫిబ్రవరి 2025 దరఖాస్తుకు చివరి తేదీ: 3 మార్చి 2025 ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 3 మార్చి 2025

విద్యార్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

తప్పనిసరి సబ్జెక్టులు: గణితం, ఇంగ్లీష్‌లను 10వ తరగతి వరకు సబ్జెక్టులుగా చదివి ఉండాలి. 

స్థానిక భాష: అభ్యర్థి తాను దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రం  స్థానిక భాషపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.  దానిని 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

Also Read: Gold News: బంగారం కొంటే మేకింగ్ ఛార్జీలపై 25% ఫ్లాట్ డిస్కౌంట్ .. ఈ కంపెనీ అందిస్తోన్న గొప్ప ఆఫర్ ఇదే  

వయోపరిమితి కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు (వయస్సు మార్చి 3, 2025 నాటికి లెక్కించబడుతుంది) ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు indiapostgdsonline.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక ప్రక్రియ ఈ నియామకంలో రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి మార్కుల ఆధారంగా తయారుచేసిన మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ₹100 SC/ST/PH/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. రాష్ట్రాల వారీగా నియామకాలు ఈ నియామకంలో, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలకు పోస్టులు విడుదల చేయబడ్డాయి.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News