SBI Clerk Mains Hall Ticket 2020: ఎస్‌బీఐ ‘క్లర్క్’ మెయిన్స్ హాల్‌ టికెట్లు విడుదల

SBI Clerk Mains Admit Card 2020: SBI Clerk Mains Exam date 2020  |  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (State Bank Of India) దేశవ్యాప్తంగా జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేస్తోంది. క్లర్క్ పోస్టుల మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్లను ఎస్‌బీఐ విడుదల చేసింది

Last Updated : Oct 21, 2020, 03:12 PM IST
SBI Clerk Mains Hall Ticket 2020: ఎస్‌బీఐ ‘క్లర్క్’ మెయిన్స్ హాల్‌ టికెట్లు విడుదల

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) దేశవ్యాప్తంగా జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేస్తోంది. క్లర్క్ పోస్టుల మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ (SBI Clerk Mains Admit Card 2020)ను ఎస్‌బీఐ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని SBI సూచించింది. ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్‌ను అక్టోబర్ 31న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. Also Read : APPSC Group 1 Mains Hall Tickets 2020: ఏపీ ‘గ్రూప్-1’ హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

SBI Clerk Mains హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి  

 

SBI క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 22, 29, మార్చి 1, 8 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా ఫలితాయి కొంత కాలం వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో అక్టోబరు 20న ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను వెల్లడించారు. పరీక్ష తేదీలను వెెల్లడిస్తూ ఎస్‌బీఐ మెయిన్స్ హాల్ టికెట్స్ (SBI Clerk Mains Hall Ticket 2020)ను విడుదల చేశారు.

Also Read : APPSC JL Results 2020: జేఎల్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

More Stories

Trending News