)
School Holiday due to Karthika Pournami: అక్టోబర్ నెలలో పిల్లకు ఏకంగా దసరాతో పాటు ఏకంగా దీపావళి పండగలు రావడంతో నిజంగానే సెలవులతో పండగ చేసుకున్నారు. ఇక దీపావళి తర్వాత నుంచి హిందువులకు పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీకంలో ప్రతి రోజుకు విశేషమైన ప్రాశస్త్యం ఉంది. బలి పాడ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ప్రతి రోజు ఏదో ఒక విశేషం ఉండనుంది. ఈ పర్వదినాల్లో ప్రజలు ఎక్కువగా దేవాలయాలను సందర్శిస్తుంటారు. మరోవైపు కార్తీక వనభోజనాలు వంటివి ఈ నెలలోనే చేస్తారు. ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే అన్ని రోగాలు పోయి.. ఆ దేవుడి దయ వల్ల ఆయు: ఆరోగ్యం సిద్దిస్తుందని ప్రజల నమ్మకం.
దీపావళి సెలవులతో విద్యార్ధులు కాస్తంత రిలాక్స్ అయ్యారు. రేపు కార్తీక పౌర్ణమి రోజున సిక్కుల మొదటి గురువు గురు నానక్ జన్మించారు. ఆయన స్మృతిలో ఉత్తరాది రాష్ట్రాల్లో గురు నానక్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. హిందువులపై ముస్లిమ్ మతోన్మాతం పెరిగిన నేపథ్యంలో ప్రతి హిందు కుటుంబం నుంచి ఒకరు తలకు పాగా చుట్టుకొని హిందు మత ఉద్దరణ చేయాలని పిలునిచ్చారు. హిందు మత ఉద్దరణ కోసం సిక్కులు ఆ తర్వాత ఓ మతంగా మారింది. సిక్కు అంటే శిష్యుడు అని అర్ధం. ఆ తర్వాత సిక్కులు అనేది ప్రత్యేక మతంగా బ్రిటిష్ వాళ్లు హిందూ మతం నుంచి వేరు చేసారు. అంతేకాదు హిందువులు, సిక్కులు వేరు వేరు అని మనలో మనకు అపార్థాలు సృష్టించారు.
ఇక ఉత్తరాదిలో రేపు నవంబర్ 5తో పాటు నవంబర్ 6 సెలవు ఉండనుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు స్కూల్లు, కాలేజీలు ప్రత్యేకంగా సెలువులు ప్రకటించాయి. ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు వంటి వాటిని చేసుకోవడానికి. ఈ రోజుతో కేదారేశ్వర నోము నోచుకోవడానికి చివరి రోజుగా భావిస్తారు. చాలా మంది ఇళ్లలో ఈ రోజు సత్యనారాయణ వ్రతంతో పాటు నోములు ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి తర్వాత హిందువులు కార్తీక పౌర్ణమిని చాలా గ్రాండ్ గా సెలబ్రేడ్ చేసుకుంటారు. ఈ రోజున నదుల్లో దీపాలు వెలిగించి ఒదులుతుంటారు. మరోవైపు ఈ నెల 8న రెండో శనివారం సెలవు ఉంది. మరోవైపు 9వ తేది ఆదివారం ఎలాగో సెలవు ఉండనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook