School Holidays: మరో నాలుగు రోజుల్లో మార్చ్ నెల ముగియనుంది. కొత్త ఆర్ధిక సంవత్సరంలో మొదటి నెల ఏప్రిల్ ప్రారంభం కానుంది. సాధారణంగా ఏప్రిల్ నెలాఖరు నుంచి స్కూల్స్, కళాశాలలు వేసవి సెలవులు ఉన్నాయి. కానీ అంతకంటే ముందే స్కూల్ విద్యార్ధులకు 3-4 రోజులు సెలవులున్నాయి.
స్కూల్ విద్యార్ధులకు శుభవార్త. ఏప్రిల్ నెలలో కూడా సెలవులు ఎంజాయ్ చేయవచ్చు. ఆదివారాలు కాకుండా ఇతర పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో మహావీర్ జయంతి, శ్రీరామనవమి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్, కళాశాలలకు సెలవులు ఉన్నాయి. అంతకంటే ముందు ఏప్రిల్ మార్చ్ 31వ తేదీన ఈదుల్ ఫిత్ర్ పండుగ సెలవు ఉంది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగ ఉంది కానీ ఆ రోజు ఆదివారం కావడంతో ప్రత్యేకంగా సెలవు లేదు. ఇక ఏప్రిల్ 10 మహావీర్ జయంతి, 13 వ తేదీన బైశాఖి పండుగ ఉన్నాయి. ఇక ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సెలవు ఉంది. ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే సెలవు ఉంది.
వీటిలో మహావీర్ జయంతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే రోజుల్లో దాదాపు దేశమంతా స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులున్నాయి. ఇక ఏప్రిల్ 24 నుంచి ఏపీ, తెలంగాణల్లో స్కూల్స్‌కు వెసవి సెలవులు ఉన్నాయి.
Also read: JEE Main 2025 Admit Card: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









