)
School Holiday on September 17: 2025 సెప్టెంబర్ 17 (బుధవారం)న దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవకు ప్రధాన కారణం విశ్వకర్మ పూజతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతూ ఉండడం . ఈ సందర్భంగా యూపీ, బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు.. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేయబడనున్నాయి.
విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం కన్యా సంక్రాంతి రోజున జరుపుకుంటారు. 2025లో అది సెప్టెంబర్ 17న.. వస్తోంది. శిల్పకారుల దేవుడిగా భావించే విశ్వకర్మను ఆరాధించడం ఈ పండుగలో ప్రధాన విశేషం. విద్యార్థులు, ఇంజినీర్లు, టెక్నికల్ రంగానికి చెందినవారికి సైతం..ఈ రోజు ఎంతో ప్రాముఖ్యం.. కలిగివుంటుంది. సాధనాలు, పరికరాలు, వర్క్‌షాప్‌లను పూజించి పని సాఫీగా సాగాలని ప్రార్థిస్తారు.
Schools Holiday In These States: ఉత్తరప్రదేశ్: ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. బ్యాంకులు, పాఠశాలలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి.
అలానే బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం, ఝార్ఖండ్, త్రిపురా.. లాంటి ప్రదేశాలలో.. విశ్వకర్మ పూజ చాలా ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని ఏరియాల్లో కూడా..పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగ స్థలాలు దాదాపు అన్నీ మూసివేయబడతాయి.
మహారాష్ట్ర: ముంబై, పూణే వంటి నగరాల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే సెలవు ఇవ్వనున్నాయి.
తెలంగాణ: హైదరాబాద్, పరిశ్రమల ప్రాంతాల్లోని కొన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు, స్కూళ్లు మూతపడతాయి.
రాజస్థాన్: ఇది రెస్ట్రిక్టెడ్ హాలిడేగా గుర్తించారు. జిల్లావారీగా స్కూళ్ల మూతపై నిర్ణయం ఉంటుంది.
పంజాబ్, హర్యానా: కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వొచ్చు.
సెప్టెంబర్ నెలలోనే ఇప్పటికే ఓణం, ఈద్-ఏ-మిలాద్ వంటి పండుగల కారణంగా పలు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశ్వకర్మ పూజ సందర్భంగా మరో సెలవు రావడం విద్యార్థులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
మొత్తం మీద.. 2025 సెప్టెంబర్ 17న యూపీతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో పాఠశాలలు తప్పనిసరిగా సెలవు ఉందనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో జిల్లాల వారీగా.. లేదా స్కూల్ మేనేజ్మెంట్ నిర్ణయం.. ఆధారంగా సెలవు ఉందనుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook