several Tourist injured in terro attack in pahalgam: అమర్ నాథ్ యాత్ర వేళ జమ్ము కశ్మీర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్గా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ముఖ్యంగా.. అనంత నాగ్ జిల్లా పహాల్గాంలో టూరిస్టులపై ముష్కరులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ముగ్గురు టూరిస్టులు స్పాట్ లోనే కన్నుమూశారు. అదే విధంగా పదుల సంఖ్యలో టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డట్లు అక్కడున్న వాళ్లు వెల్లడించారు. అనంత్ నాగ్ లోని పహాల్గంను మినీ స్విట్జార్లాండ్ గా పేర్కొంటారు. ఇక్కడకు చాలా మంది టూరిస్టులు గుర్రాల మీద వస్తుంటారు. ప్రస్తుతం అమర్ నాథ్ యాత్ర వేళ ఈ ఘటన జరగటం పెద్ద దుమారంగా మారింది.
ఇదిలా ఉండగా.. 38 రోజులు పాటు కొనాసాగే అమర్ నాథ్ యాత్రం.. జులై 3న ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అమర్ నాథ్ వచ్చేందుకు భక్తులు రిజిస్ట్రేషన్ లు చేసుకుంటున్నారు. అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గాం మార్గంలో.. ఒక 50కి. మీలు ఉండగా.. 14 కి.మీ ల మార్గం.. గండేర్బన్ జిల్లా నుంచి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. దీంతో భారీగా కేంద్రబలగాలు రంగంలోకి దిగాయి.
ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందస్తుగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముష్కరుల కోసం భద్రత బలగాలు జల్లెడ పడుతున్నారు. గాయపడిన వారిని పోలీసులు.. దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. అంతేకాకుండా.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ ఈ ఘటనలో రంగంలోకి దిగింది.
టూరిస్టులు పర్యటిస్తుంగా.. ఒక్కసారిగా ముష్కరులు కాల్పులు జరిపారని అక్కడున్న కొంత మంది చెప్పారు. దీంతో చూస్తుండగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని..కొంత మంది భయంతో పరుగులు పెట్టారని అక్కడి వాళ్లు చెప్పారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దాడి ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనపై కేంద్ర హోమంత్రి అమిత్ షాక్.. ప్రధాని ఫోన్ చేసి ఘటనపై ఆరాతీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









