Summer Impact: ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు, మార్చ్ 10 నుంచే వడగాల్పుల హెచ్చరిక

Summer Impact: వేసవి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో బయటికి రావాలంటే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో వడగాల్పులు భయం వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2025, 02:04 PM IST
Summer Impact: ఏపీ, తెలంగాణలో మండుతున్న ఎండలు, మార్చ్ 10 నుంచే వడగాల్పుల హెచ్చరిక

Summer Impact: ఈ ఏడాది మార్చ్ నెల కంటే ముందే వేసవి మొదలైపోయింది. దాదాపు వారం పది రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. మరోవైపు ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. దీనికితోడు మార్చ్ మూడో వారం నుంచి వడగాల్పులు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Add Zee News as a Preferred Source

ఫిబ్రవరి మూడో వారం నుంచే ఏపీ, తెలంగాణలో ఎండలు అధికమయ్యాయి. ఉదయం 8-9 గంటలకే సూర్యుడి ప్రతాపం కన్పిస్తోంది. మద్యాహ్నం అయితే ఇక ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఈసారి మార్చ్ రెండు లేదా మూడో వారం నుంచే వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో ఆందోళన కలుగుతోంది. ఈ వేసవిలో ఏప్రిల్-మేలో పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరిక జారీ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల అత్యధిక వేడిమి గల నెలగా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 124 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదయ్యాయి. ఈసారి ఫిబ్రవరిలో గరిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 1901 తరువాత ఇదే అత్యధికం. అంటే ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ సగటు ఉష్ణోగ్రత 15-16 డిగ్రీలే ఉంటుంది. 

ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరిక జారీ అయింది. అందుకే మార్చ్ 10వ తేదీ తరువాత రాష్ట్రంలో వడగాల్పులు మొదలవుతాయని ఐఎండీ సూచించింది. అయితే వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు పడితే తప్ప ఈసారి వాతావరణం చల్లబడే సూచనలు లేవు. ఈసారి మార్ట్ నెలలో ఏపీ, తెలంగాణలో 37 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలుస్తోంది. ఏప్రిల్ నెల నాటికి 40-45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మద్యాహ్నం 12 అయితే చాలు రోడ్లు ఖాళీగా కన్పిస్తున్నాయి. సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. 
ఈసారి ఎండల తీవ్రత పీక్స్‌కు చేరవచ్చనే భయం వెంటాడుతోంది. 

ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్ కాకుండా ఎక్కువ నీళ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. 

Also read: Ramadan Importance: రంజాన్ ప్రాముఖ్యత ఏంటి, ఉపవాసాలు ఎందుకు ఉంటారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News