
Shakti Cyclone Alert: బంగాళాఖాతంలో ఆవహించి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. క్రమంగా ఇది తుపానుగా ఆ తరువాత తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో వైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు బలమైన శక్తి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్తా తీవ్రమైన శక్తి తుపానుగా మారనుంది. మరో వైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే 3-4 రోజుల్లోనే కేరళ తీరాన్ని తాకనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న రుతు పవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో ముందుకు వెళ్లేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తనాలు, శక్తి తుపాను ప్రభావంతో రానున్న వారం రోజుల్లో కోస్తా కర్షాటక, కేరళ, మాహే, దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సోం, మేఘాలయ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలో భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలతో పాటు ఉరుములు పడే అవకాశం ఉన్నందున చెట్లు, టవర్లు, ఆరు బయట ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.
శక్తి తుపాను ప్రభావంతో రానున్న వారం రోజులు ఏపీ, తెలంగాణపై అత్యధిక ప్రభావం ఉండవచ్చు. తీవ్ర తుపానుగా మారనున్నందున అతి భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి