Shakuntala Railways Owner: భారతదేశంలోని ఈ రైలు మార్గం ఇప్పటికీ బ్రిటిష్ ఆధీనంలోనే ఉంది!

Shakuntala Railways Owner: భారతీయ రైల్వేలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ రైల్వే సామ్రాజ్యంలోని ఓ రైల్వే లైన్ మాత్రం ఇప్పటికీ బ్రిటీష్ ఆధీనంలోనే ఉంది. అదేంటో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 01:40 PM IST
Shakuntala Railways Owner: భారతదేశంలోని ఈ రైలు మార్గం ఇప్పటికీ బ్రిటిష్ ఆధీనంలోనే ఉంది!

Shakuntala Railways Owner: భారతదేశంలో ప్రతిరోజూ వేలాది రైళ్లు ప్రయాణిస్తాయి. అందులో లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అతి దుర్భేద్యమైన అడవుల్లోనూ రైలు మార్గాల ద్వారా నిత్యం రైళ్లు ప్రయాణిస్తుంటాయి. అయితే ఈ రైల్వే లైన్స్ కు గానూ.. భారతీయ రైల్వే ఇప్పటికీ, బ్రిటన్ లోని ఓ ప్రైవేట్ కంపనీకి ప్రతి ఏడాది రూ. 1.20 కోట్ల డబ్బును చెల్లిస్తుంది. 

శకుంతల రైల్వే స్టేషన్

ఈ రైల్వే స్టేషన్ మహారాష్ట్రలోని అమరావతిలో ఉంది. శకుంతల ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో నడుస్తుంది. కాబట్టి దీనిని శకుంతల రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. 1903లో బ్రిటిష్ కంపెనీ క్లిక్ నిక్సన్ తరపున ట్రాకింగ్ పని ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ 1916లో పూర్తయింది. ఈ కంపెనీ నేడు సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీగా పిలుస్తున్నారు.

ముంబయిలోని నౌకాశ్రయానికి పత్తిని రవాణా చేయడానికి బ్రిటిష్ వారు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. అమరావతి ప్రాంతంలో పండిన పత్తికి దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంది. దీంతో ముంబయి నౌకాశ్రయానికి పత్తిని రవాణా చేయడానికి బ్రిటిష్ వారు ఈ రైల్వే లైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా ఈ రైలు మార్గ విస్తరణ కోసం ప్రైవేట్ కంపనీలు మాత్రమే పనిచేస్తుండడం విశేషం. 

శకుంతల రైల్వే మార్గం ఇప్పటికి UK కంపెనీ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ ట్రాక్ నిర్వహణ బాధ్యత కూడా ఆ సంస్థపైనే ఉంది. కానీ, గత 60 ఏళ్లుగా ఈ ట్రాక్ కు ఎలాంటి మరమ్మతులు జరగలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ట్రాక్ పై లోకో ఇంజన్స్ గరిష్టంగా 20 కి.మీ. వేగంతో వెళ్తున్నాయి. 

Also Read: Indian Railways: మీ రైలు ప్రయాణ తేదీని ఎలా మార్చుకోవాలి, అలా చేస్తే టికెట్ రద్దవుతుందా

Also Read: India Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News