close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

షీలా దీక్షిత్ కోరిక ప్రకారమే సీఎన్జీ గ్యాస్‌తో అంత్యక్రియలు పూర్తి

నిగంబోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో షీలా దీక్షిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Pavan Reddy Naini Pavan | Updated: Jul 21, 2019, 05:36 PM IST
షీలా దీక్షిత్ కోరిక ప్రకారమే సీఎన్జీ గ్యాస్‌తో అంత్యక్రియలు పూర్తి
Source : ANI

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి షీలా దీక్షిత్ అంతిమయాత్ర ప్రారంభం కాగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఆమె అంతిమ యాత్ర నిగంబోధ్ ఘాట్‌కి చేరుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా భారీ సంఖ్యలో వివిధ పార్టీల అగ్రనేతలు, వీవీఐపీలు, అభిమానులు ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం నిగంబోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో షీలా దీక్షిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన దహన సంస్కారాల్లో కలపకు బదులు సీఎన్జీ గ్యాస్(కంప్రెస్‌డ్ న్యాచురల్ గ్యాస్) ఉపయోగించాలన్న ఆమె కోరిక మేరకు సీఎన్జీ గ్యాస్ సహాయంతోనే అంత్యక్రియలు పూర్తిచేసినట్టు తెలుస్తోంది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మధ్యాహ్నం ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హాస్పిటల్‌లో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.