)
Boy Kidnap Video Viral: పిల్లలకు ఇంటి వద్ద కూడా భద్రత లేకుండా పోతుంది. కన్న తండ్రి తండ్రుల చేతుల్లో ఉన్న కానీ వాళ్ళు కిడ్నాప్ గురవ్వక తప్పడం లేదు. అలాంటి ఘటనే తమిళనాడులోని అమ్మని పేట గుడియాత్తంలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి తన ఇంటి వద్ద తండ్రి చేతిలో ఉండగా అతని ముఖంపై కొట్టి కారంపొడి కొట్టి కిడ్నాపర్లు ఆ బాలుని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వివరాలు.. పాఠశాల నుంచి తన నాలుగేళ్ల కుమారుడిని ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు వేణు అనే వ్యక్తి. అతను ముందుగా పిల్లవాడిని బండిపై నుంచి కిందకు దింపి వాహనాన్ని పార్కింగ్ చేస్తూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి వేణు ముఖంపై కారం పొడి చల్లి ఆ బాలుడిని కొడుకుని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని పారిపోయారు. అయితే తండ్రి వారిని రక్షించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కారులో ఈడ్చుకుంటూ కొంత దూరం వెళ్లి వేణు కింద పడిపోయాడు. .
వెంటనే సదరు బాలుడు తండ్రి అయిన వేణు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను చూశారు. బాలుడు కిడ్నాప్ ఘటన అంతా అక్కడ సిసిటీవీలో రికార్డు అయింది. అయితే కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆ కిడ్నాపర్లను పట్టుకోడానికి ప్రయత్నించారు పోలీసులు. అది కర్నాటకకు చెందిన కారుగా గుర్తించారు. అయితే హెల్మెట్ ధరించిన వ్యక్తి అదను చూసి కిడ్నాప్ చేయడానికి వేణు ఇంటి బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే ముందస్తుగానే ఆ సమయంలో వాళ్లు స్కూలు నుంచి ఇంటికి వస్తారని తెలుసుకొని మరి నేను ముఖంపై కారం పొడి చల్లి అతని కుమారుని కిడ్నాప్ చేశారని పోలీసులు గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి బాలుడు ఆచూకీ కోసం వెతక సాగారు. దాదాపు మూడు గంటల్లోనే కిడ్నాప్‌ను ఛేదించారు. వెల్లూరు నుంచి బాలుడు రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడి ఉండడానికి పోలీసులు గుర్తించారు. వెంటనే బాలుడు రక్షించి స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. ఆ తర్వాత వేణు కుటుంబానికి సమాచారం అందించగా వెంటనే తమ కుమారుడిగా నిర్ధారించారు. అయితే పోలీసులు ఈ కిడ్నాప్ పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారో అదే విధంగా ఎందుకు అలా రోడ్డుపై వదిలేశారు తెలియాల్సి ఉంది.
#வேலூர் குடியாத்தம் அருகே தந்தை மீது மிளகாய் பொடி தூவி, காரில் கடத்தப்பட்ட 4 வயது சிறுவன் #காவல்துறையால் மீட்கப்பட்டார். இதுகுறித்த சிசிடிவி காட்சி வெளியாகியுள்ளது#Vellore #BoyKidnap #TamilNaduPolice #Thentamilhttps://t.co/OIlafLL63A pic.twitter.com/NgpNL7yV9u
— ThentamilOfficial (@ThentamilOff) September 24, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి