Siddaramaiah Video: అందరూ చూస్తుండగానే ASP చెంప పగలగొట్టేందుకు చేయెత్తిన సీఎం వీడియో వైరల్‌..

Siddaramaiah Slap Attempt Video: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆయన అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్‌ను చెంప దెబ్బ కొట్టబోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 29, 2025, 09:33 AM IST
Siddaramaiah Video: అందరూ చూస్తుండగానే ASP చెంప పగలగొట్టేందుకు చేయెత్తిన సీఎం వీడియో వైరల్‌..

Siddaramaiah Slap Attempt Video: ఓ పోలీసు ఉన్నతాధికారి పై ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేయి చేసుకోబోయాడు. బెళగావిలో నిన్న జరిగిన బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రసంగించారు. ఈ నేపథ్యంలో వేదిక వద్ద తీవ్ర స్థాయిలో గందరగోళం ఏర్పడింది. అయితే సదరు పోలీసుల అధికారిని స్టేజీపైకి పిలిచిన ముఖ్యమంత్రి  ఆయనపై చేయి చేసుకోబోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో చూసిన చాలామంది సిద్ధ రామయ్య దురుసుతనాన్ని వెళ్లగక్కాడు అని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక పోలీసు అధికారిపై ఇలా చేయి ఎత్తడం ఎంత వరకు సమంజసం అని మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే లేపుతోంది.

Add Zee News as a Preferred Source

 నిన్న సోమవారం జరిగిన సమావేశంలో ప్రధానంగా బీజేపీ మహిళా మోర్చా సభ్యులు నల్ల జెండాలతో వేదిక వద్ద ప్రసంగానికి అడ్డంకిగా తమ నిరసన తెలియజేశారు.ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి పోలీస్ అధికారి పై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. అది వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఇలా తన సహనాన్ని కోల్పోయి ఒక పోలీసు అధికారిపై చేయి ఎత్తడం ఏంటి ?అని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకోవడమే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

 

 

 ఒక రాజకీయ నాయకుడి అధికారం కేవలం ఐదు ఏళ్లు మాత్రమే కానీ పోలీసు అధికారులు తన జీవితకాలం పనిచేస్తారు. ఇలా వారిపై చేయి చేసుకోవడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిద్ధ రామయ్యకు ఇలాంటి వివాదాలు మొదటిసారి కాదు. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయనపై విమర్శలు కూడా వస్తూనే ఉంటాయి . ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడిపై ఆయన వ్యాఖ్యానిస్తూ పాక్‌తో యుద్ధం అవసరం లేదని కూడా చెప్పారు. ఆ తర్వాత దానికి కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.

READ ALSO:   పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం కీలకనిర్ణయం..48 టూరిస్టు ప్రాంతాల మూసివేత..  

READ ALSO: నేటి రాశిఫలాలు.. ఇబ్బందులు పడే రాశులు ఇవే, సక్సెస్‌ పొందబోతున్న ఏకైక రాశి ఇదే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News