)
Six year old girl found inside wash room dustbin mumbai: ఇటీవల కాలంలో సమాజంలో అనేకమైన దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎవర్ని నమ్మాలి.. ఎవర్ని నమ్మాలో కూడా కూడా అర్థంకానీ విధంగా షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. భార్యభర్తలు, బంధువులు, స్నేహితులు.. ఇలా చాలా మంచి సంబంధాల్లో కూడా చిన్నపాటి తేడాలు వస్తే హత్యలు చేయడానికి సైతం వెనుకాడటంలేదు.
ఈ క్రమంలో కొంత మంది డబ్బుల కోసం, ఆస్తి పాస్తుల కోసం గొడవలకు దిగుతున్నారు. మరికొంత మంది అసూయతో చిన్న , పెద్దా అని తేడాలేకుండా ఎవరి ప్రాణాలు సైతం తీసేందుకు వెనక్కుతగ్గడంలేదు. ప్రస్తుతం ముంబై లోకమాన్య టెర్మినల్ రైల్వేస్టేషన్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
నాసిక్ నుంచి ముంబై చేరుకున్న కుశినగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వాష్ రూమ్ లోని డస్ట్ బిన్ లో ఒక చిన్నారి డెడ్ బాడీని రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు అధికారులు గుర్తించారు.
అయితే.. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. చిన్నారిది గుజరాత్ అని పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆమె తప్పిపోయింది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఆతర్వాత నాసిక్ తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబై వస్తున్న ట్రైన్లో ఎక్కి.. చంపేసి ట్రైన్ డస్ట్ బిన్ లో వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో క్లూస్ టీమ్, జాగీలాలు రంగంలోకి దిగి ట్రైన్ లో గాలింపుచర్యలు చేపట్టారు.
బంధువులు, తెలిసిన వారి పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి