SLBC Tunnel Collapse: 72 గంటలు..అసలు బతికి ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారు

SLBC Tunnel Collapse Updates: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనకు మూడ్రోజులు దాటింది. గల్లంతైన 8 మందిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అసలు ఆ 8 మంది ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని దయనీయ పరిస్థితి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2025, 10:01 AM IST
SLBC Tunnel Collapse: 72 గంటలు..అసలు బతికి ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారు

SLBC Tunnel Collapse Updates: SLBC టన్నెల్ ప్రమాదం జరిగి 72 గంటలు దాటేసింది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎల్ అండ్ టి, సింగరేణి రెస్క్యూ టీమ్, ర్యాట్ హోల్ మైనర్లు ఇలా అందరూ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. సొరంగంలో పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉండటంతో సహాయక చర్యలు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. 

Add Zee News as a Preferred Source

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో SLBC టన్నెల్ పైకప్పు కూలడంతో లోపల 14వ కిలోమీటర్ వద్ద 8 మంది చిక్కుకుపోయారు. టన్నెల్ అటు వైపు మూసుకుపోయి ఉండటం, ఇటువైపు కూలిన పైకప్పు శిథిలాలు, బురద మట్టి, నీరు చేరుకోవడంతో పాటు టన్నెల్ మిషన్ ధ్వంసమై చిక్కుకుపోయింది. దాంతో 8 మంది ఏ పరిస్థితుల్లో ఉన్నారో...బతికున్నారో లేదా కూడా తెలియని పరిస్థితి. బతికే ఉంటే ఆక్సిజన్ ఇబ్బంది తప్పకుండా ఉంటుంది. సహాయక చర్యలకు టన్నెల్ బోరింగ్ మిషన్ అతి పెద్ద అడ్డంకిగా మారింది. మిషన్ ధ్వంసమైంది. మిషన్ వెనుక వైపున భారీగా మట్టి, రాళ్లు, బురద ఉన్నాయి. దాంతో మిషన్ దాటి సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నారు. 

ఒకవేళ భారీ కట్టర్లతో కట్ చేసి మిషన్ తొలగించే ప్రయత్నం చేద్దామంటే పైకప్పు మరోసారి కుప్పకూలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. SLBC టన్నెల్‌లో 13.452 కిలోమీటర్లు దాటిన తరువాత పరిస్థితి అత్యంత దయనీయంగా, దారుణంగా ఉంది. సీపేజ్ జోన్, డేంజర్ జోన్ ఉన్నాయి. అందుకే సహాయక బృందాలు లోపలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

టన్నెల్ ప్రమాద స్థలానికి 100-150 మీటర్ల దూరం వరకే సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నారు. ఆ తరువాత ముందుకు వెళ్లలేని పరిస్థితి. లోపల పేరుకుపోయిన బురద, నీటిని బయటకు తొలగిస్తే తప్ప పరిస్థితి ఏంటనేది చెప్పలేమంటున్నారు అధికారులు. 72 గంటలుగా ఆ 8 మంది సిబ్బంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియడం లేదు. అసలు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది అంతుచిక్కడం లేదు. 

Also read: Earthquake Hit: బంగాళాఖాతంలో భారీ భూకంపం, సునామీ వచ్చే ప్రమాదముందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News