Ex CM SM Krishna Passes Away: బెంగళూరు బ్రాండ్‌ను గ్లోబల్ మ్యాప్‌లో చేర్చిన అధినేత మాజీ కర్నాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ (92) ఈరోజు ఉదయం ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన ప్రముఖ రాజకీయనేత. ఉదయం 2:45 నిమిషాలకు కన్నుమూశారు.గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఎస్‌ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహల్లి మల్లయ్య కృష్ణ. ఈయన కర్నాటక సీఎంగా 1999 నుంచి 2004 వరకు పనిచేశారు. ఆ తర్వాత మహారాష్ట్రకు గవర్నర్‌గా 2004 నుంచి 2008 వరకు ఉన్నారు. ఎస్‌ఎం కృష్ణ 2009ay విదేశాంగ మంత్రిగా కూడా పనిచేసిన అరుదైన ఘనత ఈయన సొంతం. ముఖ్యంగా ఈయన బెంగళూరును టెక్ క్యాపిటల్‌గా మార్చారు. గ్లోబల్ మ్యాప్ బెంగళూరు మంచి గుర్తింపు లభించేలా ఈయన ప్రయత్నం ఎప్పటికీ మర్చిపోలేనిది.
ఇదీ చదవండి: Sreemukhi: పచ్చలెహంగా ధరించి పుత్తడిబొమ్మలా కవ్విస్తోన్న శ్రీముఖి.. ట్రెండింగ్ ఫోటోలు..!
ఎస్ ఎం కృష్ణ 1932లో మాండ్యలో జన్మించారు. మైసూరులోని మహారాజ కాలేజీలో డిగ్రీ పొందారు. బెంగళూరు ప్రభుత్వ లా డిగ్రీ కాలేజీలో చదివారు. ఆ తర్వాతి కాలంలో అమెరికా వెళ్లి డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్శిటీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీలో కూడా ఉన్నత విద్యను అభ్యసించారు.
ఎస్‌ఎం కృష్ణ రాజకీయ జీవితం 1962లో ప్రారంభమైంది. ఇండిపెండెంట్‌గా ఆ ఏడాది మద్దూరు అసెంబ్లీ నుంచి గెలిచి కర్నాటక అసెంబ్లీలో చోటు సంపాదించుకున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన ఆ తర్వాతి కాలంలో బీజేపీలో చేరారు.
ఎస్‌ఎం కృష్ణ ఎమ్మెల్యే, ఎంపీగా లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. కర్నాటక అసెంబ్లీ స్పీకర్, డప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. భారత విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇండియా విదేశాంగ విధానంలో కీలక పాత్ర పోషించారు. ఎస్‌ఎం కృష్ణకు టెన్నీస్ అంటే చాలా ఇష్టం. ఈయనకు ఆస్ట్రేలియా టెన్నీస్ ఆటగాడు లెజెండ్ ఫ్రాంక్ సెడ్మాన్‌కు ఫ్యాన్. ఆయన తరచూ లండన్‌లో జరిగే వింబుల్డన్ మ్యాచ్‌కు కూడా వెళ్లేవారు అంటే టెన్నీస్ ఎంత ఆయనకు ఇష్టమో తెలిసిపోతుంది.
2023లో న్యూఢిల్లోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపద ముర్మూ చేతుల మీదుగా పద్మ విభూషణ్ సత్కారం కూడా పొందారు. ఎస్‌ఎం కృష్ణ మృతికి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. కర్నాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేసిన సేవలు ఎప్పటికీ చెరగని ముద్ర అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం..
'కర్నాటక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్‌ఎం కృష్ణ మరణవార్త అత్యంత దిగ్భ్రాంతి కరం. నాకు చాలా బాధ అనిపించింది. రెండు రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడంలో మేము పంచుకున్న పోటీ స్పూర్తిదాయకం. ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని కోరుకున్న నిజమైన నాయకుడు ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి' అని ఎక్స్ వేదికగా చంద్రబాబు సంతాపం తెలియజేశారు.
I'm deeply saddened to hear about the passing of former Karnataka Chief Minister, Sri SM Krishna Garu. Our friendship transcended the competitive spirit we shared in attracting investments to our respective states. He was a true leader who always prioritized the welfare of his… pic.twitter.com/JjtAw4g2ug
— N Chandrababu Naidu (@ncbn) December 10, 2024
ఇదీ చదవండి: Brahmamudi Kavya: బిగ్ బాస్ హౌస్‌లోకి కావ్య..? బిగ్ సర్‌ప్రైజ్ అంటూ వైరల్ పోస్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









