)
South Central Railway Extends Special Train Services: దసరా, దీపావళి, ఛత్‌పూజా పండుగలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. దసరా, దీపావళి, ఛత్‌పూజా పండుగల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నగరాల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు. మరోవైపు.. ఇప్పటికే హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల గడువును పొడగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
స్పెషల్ ట్రైన్స్ సేవల కొనసాగింపు ఇలా..
* పూరి-పాట్నా మధ్య ప్రతి శనివారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08439)ను సెప్టెంబర్ 13 నుంచి 29వ తేదీ వరకు పొడించారు.
* పాట్నా- పూరి మధ్య ప్రతి ఆదివారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08440)ను సెప్టెంబర్ 14 నుంచి 29 వరకు పొడిగించారు.
* భువనేశ్వర్ - యశ్వంతపూర్ మధ్య ప్రతి శనివారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.02811)ను సెప్టెంబర్ 13 వరకు పొడగించారు.
* భువనేశ్వర్ - యశ్వంతపూర్ మధ్య ప్రతి సోమవారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.02812)ను సెప్టెంబర్ 15 నుంచి డిసెంబరు 1 వరకు పొడగించారు.
* విశాఖ-ఎన్ఎం మధ్య ప్రతి ఆదివారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08581)ను సెప్టెంబర్ 4 నుంచి నవంబరు 30 వరకు పొడగించగా.. SMVT-విశాఖ మధ్య ప్రతి సోమవారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08582)ను సెప్టెంబర్ 15 నుంచి డిసెంబరు 1 వరకు పొడగించారు.
* విశాఖ - తిరుపతి మధ్య ప్రతి బుధవారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08547)ను అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు, తిరుపతి-విశాఖపట్నం మధ్య ప్రతి గురువారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08548)ను అక్టోబరు 2 నుంచి నవంబరు 27 వరకు పొడగించారు.
* విశాఖ-చర్లపల్లి మధ్య ప్రతి శుక్రవారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08579)ను అక్టోబరు 3 నుంచి నవంబరు 28 వరకు. చర్లపల్లి-విశాఖ మధ్య ప్రతి శనివారం నడిచే ప్రత్యేక రైలు (నెంబర్.08580)ను అక్టోబరు 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ వివరాలు..
* చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే స్పెషల్ ట్రైన్‌ను దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నవంబరు 26 వరకు పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
* చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే ట్రైన్ (నెంబర్. 07013)ను నవంబరు 25 వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్లు చెప్పారు. అలాగే తిరుపతి-చర్లపల్లి మధ్య నడిచే ట్రైన్ (నెంబర్. 07014) నవంబరు 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణీకులకు సేవలు అందించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook