Lord Sri Ram 16 Virtues: బతికితే రాముడిలా బతకాలని అందరూ చెబుతుంటారు. శ్రీరాముడి ఆదర్శ జీవితం అని.. అతడి జీవితం నుంచి చాలా అంశాలు నేర్చుకుంటే మన జీవితానికి పరమార్థం.. సార్థకత ఉంటుందని పెద్దలు అంటుంటారు. సకల గుణాలు కలిగిన రాముడు అని.. ధైర్య సాహసాలు, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. పురుషోత్తముడు అంటూ ఇలా రాముడిని కీర్తిస్తుంటారు. రాముడి సద్గుణాలు కలిగి ఉండాలని చెబుతుంటారు. మరి అవేమిటో తెలుసుకుందాం.
Also Read: Ramayan: రామాయణం ఎందుకు చదవాలి? ఆసక్తికర రహాస్యాలు ఇవే!
పదహారు సుగుణాల సంపన్నుడు!
రామునిది స్త్రీ వలె అత్యంత కోమలమైన, సున్నితమైన శరీరం అని పురాత ఇతిహాసాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అపార రూపలావణ్యం కలవాడు. పురుషుడే అయినా గొప్ప సౌందర్యవంతుడు, తేజోసంపన్నుడు కూడా అని రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి. ధర్మంలో మూర్తీభవించిన వ్యక్తి రాముడు. ఆయన ఎంత పరాక్రమవంతుడో అంతసాధు స్వభావి. శ్రీరాముడు పదహారు సద్గుణాలు కలిగిన వాడని పండితులు చెబుతారు.
Also Read: Bhadrachalam Kalyanam: సీతమ్మ తల్లికి 'సిరిసిల్ల' బంగారు చీర.. చేనేత కళాకారుడి కానుక
శ్రీరాముడి సద్గుణాలు ఇవే..
- చేసిన మేలు మరవని వాడు
- నిరంతరం సత్యాన్నే పలికేవాడు
- అనుకున్న పనిని దృఢ చిత్తంతో చేసేవాడు
- సర్వభూతాలపట్ల దయగలవాడు
- కోపాన్ని జయించినవాడు
- అపారమైన సంకల్పశక్తి గలవాడు
- సకల విద్యా పారంగతుడు
- శత్రువులను జయించగల శక్తి సంపన్నుడు
- లోకాన్ని పోషించగల ఐశ్వర్యవంతుడు
- సముద్రమంత గాంభీర్యం
- హిమాలయాలంత ధైర్యం
- నీతి నిజాయతీకి నిలువుటద్దం
- పెద్దలంటే అపారమైన గౌరవం
- స్త్రీల పట్ల ఎంతో గౌరవం కలిగినవాడు
- పరిపాలన దక్షతకు మరో రూపం
- పేద, ధనిక తారతమ్యం ఎరుగని వ్యక్తిత్వం
ఇలా వర్ణిస్తూ వెళ్తే అంతులేని సుగుణాలు రాముడి గురించి ఉన్నాయి. సుగుణాల్లో సంపన్నుడు.. రారాజుగా శ్రీరాముడిని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటారు.. తీసుకోవాలి కూడా. అయితే ఎంతటి గొప్ప రాజు అయినా కూడా తనను తాను మానవుడిగా శ్రీరాముడు చెప్పుకుంటాడు. 'నేను మానవుడినే. దశరథ మహారాజు అబ్బాయిని' అని రాముడు గర్వంగా చెబుతుంటాడు. కానీ ఋషులు, వానరులు, రాక్షసులు ఎవరూ అంగీకరించకపోయినా తనను మానవుడిగా రాముడు చెప్పుకుంటూ అందరితో కలివిడిగా ఉంటాడు. రాజు అనే గర్వం కించిత్తు కూడా ఉండదు. రాముడిని దేవుడిగా పక్కనపెడితే మానవుడిగా శ్రీరాముడి నుంచి నేర్చుకోదగిన అంశాలు ఈ శ్రీరామ నవమి సందర్భంగా తెలుసుకుందాం. మనం కూడా మన జీవితంలో అనుసరిద్దాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









