Stock Markets: భారత్ పై విధించబోతన్న సుంకాలను మరో 90 రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు వాయిదా వేసిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఉదయం నిఫ్టీ 375 పాయింట్లు గెయిన్ చేసి 22,774 దగ్గర కొనసాగింది. సెన్సెక్ 1.165 పాయింట్స్ పుంజుకుంది. 75012 వద్ద ట్రేడ్ అయింది.
నిన్న స్టాక్ మార్కెట్‌కు హాలిడే కాగా ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా పలు దేశాలపై టారిఫ్ విరామ ప్రకటన, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 51 పైసలు పెరిగి, 86.18 వద్ద కదలాడుతోంది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
అయితే నిన్న భారీ లాభాల్లో ట్రేడ్ అయిన ఆసియా మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిన్నటి లాభాలు ఇవాళ ఆవిరయ్యాయి. మరోవైపు అమెరికా చైనా పై భారీగా దిగుమతి సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై భారీగా టాక్సెస్ విధించింది. దీంతో అమెరికాలో చైనా వస్తువుల రేట్స్ భారీగా పెరిగాయి. దీంతో ఫైనల్ గా అమెరికా ప్రజలకు నష్టం చేకూరే అవకాశాలున్నట్టు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









