)
Super Moon: మాములుగా కనిపించే చంద్రుడి కన్నా.. 14 శాతం సైజు, 30 శాతం వెలుగుతో అధికంగా చంద్రుడు కనిపిస్తున్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండు సూపర్ మూన్ ఉండనున్నాయి. భూమి నీడ చంద్రుడిపై పడటాన్నే చంద్ర గ్రహణంగా పిలుస్తారు. అయితే.. చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు. దీన్నే అంతరిక్ష పరిభాషలో సూపర్ మూన్‌గా పిలుస్తుంటారు. ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్నీ ప్రకాశవంతం చేసింది. నిన్నటి తో పాటు ఇవాళ కూడా సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాల పండుగను సాక్షాత్కరించనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే పెద్దగా మరింత వెలుగులతో కనిపించాడు. భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఇదంత పౌర్ణమి రోజు జరుగుతుంది. నిన్న సాయం సమయానికి పౌర్ణమి తిథి కావడంతో ఇది సంభవించింది. సూర్య కాంతి మొత్తం చంద్రునిపై ప్రతిఫలించి అతని ప్రకాశం అనూహ్యంగా పెరుగుతుంది.
ఖగోళ విజ్ఞానం ప్రకారం.. ఈ సూపర్ మూన్ సమయంలో చంద్రుడి పరిమాణం సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా కనిపిస్తుంది అలాగే 30 శాతం ఎక్కువ వెలుగులు చిమ్మనిన్నాడు. ఆకాశం అంతా చంద్రకాంతితో నిండిపోతుంది. నగరాల వెలుగులు తగ్గిన ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక ఇది ఈ ఏడాదిలో చివరి త్రైమాసికానికి ముందు రోజులలో కనపడిన సూపర్ మూన్ కావడంతో, దీనిని “హార్వెస్ట్ మూన్” అని కూడా పిలుస్తారు. సంప్రదాయంగా ఈ కాలంలో రైతులు పంటలు కోసే సీజన్ కావడంతో, రాత్రి వెలుతురు ఎక్కువగా ఉండే ఈ పౌర్ణమిని ఆ పేరు పెట్టారు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా మరో రెండు సూపర్ మూన్స్ దర్శనమివ్వనున్నాయి.
దీంతో ఈ సూపర్ మూన్స్ కోసం ఖగోళ ప్రేమికులు, ఆకాశ వీక్షకులు ఈ మూడు చంద్ర దర్శనాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ మూన్‌ను ప్రత్యేక పరికరాలు లేకుండానే కన్నులారా వీక్షించవచ్చు. కానీ, ఆకాశం స్పష్టంగా ఉండే ప్రాంతాల్లో చూడడం ఉత్తమం. వాతావరణం మబ్బుగా లేకపోతే, చంద్రుడు తన సంపూర్ణ కాంతితో ప్రజలకు కనువిందు చేయనున్నాడు. అయితే భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో సూపర్ మూన్ కనువిందు చేయగా... తెలంగాణలో మాత్రం పెద్దగా కనిపించలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.