Supreme court on 42 percent reservations bill: బీసీ రిజర్వేషన్ల అంశం జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన స్టేపై కాంగ్రెస్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది.
ఈ క్రమంలోదీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో రేవంత్ సర్కారుకు ప్రస్తుతం పుండు మీద కారం చల్లినట్లైంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పాత విధానంలో ఎన్నికలకు పోవచ్చని వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ?.. అని తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్ కు ప్రశ్నలు సంధించింది. దీనిపై న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు.
రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, తెలంగాణలో ప్రస్తుతం బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని వెల్లడించారు.
శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామని చెప్పారు. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామన్నారు.
గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారని కోర్టుకు చెప్పారన్నారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా.. బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు
రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. గతంలో సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందన్నారు.
కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామన్నారు. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచినట్లు కోర్టు వారికి చెప్పారు. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించినట్లు వాదనలు విన్పించారు.
ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించామని, దీనిపైన స్టే ఎలా విధిస్తారని కోర్టువారికి చెప్పారు. హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవన్నారు. వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









