Supreme Court On Freebies: ఇంకెంత కాలం ఉచితాలిస్తారు, సుప్రీంకోర్టు మండిపాటు

Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 10, 2024, 02:52 PM IST
Supreme Court On Freebies: ఇంకెంత కాలం ఉచితాలిస్తారు, సుప్రీంకోర్టు మండిపాటు

Supreme Court On Freebies: కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలు చూసి ఆశ్చర్యపడింది. ఇంకెంతకాలం ఉచితాలు కొనసాగిస్తారని మండిపడింది. ఈ సందర్భంగా కొన్ని సూచనలు జారీ చేసింది. 

కోవిడ్ సమయం నుంచి వలస కార్మికుల కష్టాలు కొనసాగుతున్నాయి. శ్రమ పోర్టల్‌లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 2013 జాతీయ భద్రతా చట్టం ప్రకారం 81 కోట్లమందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టుకు గణాంకాలు సమర్పించింది. ఈ గణాంకాలు చూసి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్ విస్మయం వ్యక్తం చేశారు. మొత్తం జనాభాలో 81 కోట్లమందికి ఉచిత రేషన్ ఇస్తుంటే ఇక మిగిలింది ట్యాక్స్ పేయర్లేనా అని వ్యాఖ్యానించింది. ఇంకెంత కాలం ఉచితాలు ఇస్తారని మండిపడింది. 

ఉచితాలు ఇచ్చే కంటే కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే పని ఎందుకు చేయకూడదని కోర్టు ప్రశ్నించింది. దేశంలో అందరికీ ఉచిత రేషన్ ఇచ్చేస్తుంటే ఇక పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఉచితాల కోసం మిగిలినట్టున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

Also read: Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News