Supreme Court on Wakf: వక్ఫ్ సవరణ చట్టంపై కీలక పరిణామం, స్టే విధించిన సుప్రీంకోర్టు

Supreme Court on Wakf: వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుపీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టానికి సంబంధించి పలు అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2025, 05:51 PM IST
Supreme Court on Wakf: వక్ఫ్ సవరణ చట్టంపై కీలక పరిణామం, స్టే విధించిన సుప్రీంకోర్టు

Supreme Court on Wakf: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఏకంగా 73 పిటీషన్లు దాఖలయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ జరిపింది. 

Add Zee News as a Preferred Source

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై నిన్న అంటే ఏప్రిల్ 16న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘకాలంగా ముస్లిం సంబంధిత కార్యక్రమాలకు వినియోగిస్తున్న వక్ఫ్ బై యూజర్ ఆస్తుల్ని డీ నోటిపై చేస్తే పలు సమస్యలు తలెత్తుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. వక్ఫ్ బై యూజర్ ఆస్తులు దుర్వినియోగమయ్యాయనేది వాస్తవమే అయినా అనేక ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు కూడా వాడుతున్నారని కోర్టు తెలిపింది. హిందూవుల ఆస్తులు హిందూవులే నిర్వహిస్తున్నారు కదా అని ప్రశ్నించింది. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. 

వక్ఫ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

వక్ఫ్ ఆస్తులు, నియామకాలై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించి మే 5వ తేదీకు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకూ వక్ఫ్ ఆస్తుల్ని డీ నోటిఫై చేయకూడదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టవద్దని, ముస్లిమేతరుల్ని సభ్యులుగా నియమించవద్దని కోర్టు స్పష్టం చేసింది. పిటీషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై వారం రోజుల్లో వివరంగా సమధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. వక్ఫ్ ఆస్తుల్ని డీ నోటిఫై చేయవద్దని సూచించింది.

Also read: AP SSC Results 2025: పదో తరగతి SSC ఫలితాలు ఏప్రిల్ 22న, ఆన్‌లైన్, వాట్సప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News