Supreme Court: హెచ్‌సీయూ భూముల వివాదం.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు..రేవంత్ సర్కారుకు కీలక ఆదేశాలు..!

Hcu forest land controversy:హెచ్‌సీయూ వివాదంపై అత్యవసరంగా విచారణ చేయాలని అత్యున్నత ధర్మాసనం సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో దీనిపై సుప్రీంకోర్టు హైదరాబాద్ సెంట్రల్ యూనీవర్సీటీ రిజిస్ట్రార్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 3, 2025, 12:15 PM IST
  • హెచ్‌సీయూపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
  • తదుపరి ఉత్తర్వుల వరకు చెట్లను కొట్టేయోద్దని ఆదేశాలు..
Supreme Court: హెచ్‌సీయూ భూముల వివాదం.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు..రేవంత్ సర్కారుకు కీలక ఆదేశాలు..!

Supreme court on hyderabad hcu land controversy: తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ వివాదం ప్రస్తుతం సుప్రీమ్ కోర్టుకు చేరింది. అత్యవసరంగా దీనిపై విచారణ చేయాలని పిటీషనర్ తన పిటిషన్ లో కోరారు. ఈ క్రమంలో దీనిపై అత్యున్నత ధర్మాసం.. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ కు పలు ఆదేశాలు జారీ చేసింది. అసలు.. ప్రభుత్వం హెచ్‌సీయూ లో ఏ భూమిని అమ్మకానికి పెట్టాలనుకుంటుందో దాన్ని చూసి.. మధ్యాహ్నం 3.30  ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Add Zee News as a Preferred Source

అదే విధంగా తుది ఆదేశాలు వచ్చేవరకు కూడా తెలంగాణ సర్కారు.. హెచ్‌సీయూలో చెట్లు నరకడం లాంటి ఎలాంటి పనులు చేయకూడదని కూడా తెలంగాణ సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మధ్యాహ్నం 3.30 గంటలకు తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈక్రమంలో తెలంగాణ తరపు లాయర్ లు..గత 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందన్నారు. ఆ 400 ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ అనడానికి ఎలాంటి  ఆధారాలులేవన్నారు.  దీనిపై తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వడంలేదని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మాత్రం ఎలాంటి పనులు చేయోద్దని సుప్రీమ్ కోర్టు తెల్చి చెప్పింది.  

కంచ గచ్చిబౌలీలో జంతుజాలాలు ఉన్నచోట పర్యావరణ నిపుణుల కమిటీ వెళ్లి చూడాలని.. వారు ఇచ్చిన సిఫారసుల్ని బట్టి చర్యలు తీసకొవాల్సి ఉంటుందని హెచ్ సీయూ తరపున లాయర్ లో సుప్రీంకోర్టులో పిటిషన్లో కోరారు.

Read more: BRS KTR Video: బిడ్డా.. రేవంత్ నువ్వు తగ్గాల్సిందే..!.. హెచ్‌సీయూ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

కానీ తెలంగాణ సర్కారు మాత్రం ఇవేం పట్టించుకొకుండా.. తమకు నచ్చినట్లు నరికివేతల్ని చేస్తుందని.. హైకోర్టు ఉత్తర్వుల్ని సైతం రేవంత్ సర్కారు బేఖాతరు చేసిందని.. అత్యున్నత ధర్మాసనంకు పిటిషనర్ తరపున లాయర్ లు ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్న అంశాల్ని వివరించారు. పర్యావరణానికి హనీ కల్గించే విధంగా రేవంత్ సర్కారు ముందుకు వెళ్తుందని .. దీనిపై వెంటనే విచారణ చేయాలని.. జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు లాయర్ లు తమ వాదనలు విన్పించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News