Supreme court key order pooja khedkar case: పూణే మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఒక వైపున అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా.. ఏకంగా నకిలీ సర్టిఫికెట్ లతో ఎగ్జామ్ లను రాసి జాబ్ సంపాదించినట్లు విషయం బైటపడింది. దీనిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేశారు.
అదే విధంగా యూపీఎస్సీ తమ సర్వీసుల నుంచి పూజాఖేడ్కర్ ను శాశ్వతంగా డిబార్ చేసింది. ఈ ఘటనపై పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాము కల్గజేసుకొలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ పోలీసుల అరెస్ట్ నుంచి మాత్రం స్టే ఇస్తు వస్తుంది. ఈ క్రమంలో.. పూజా ఖేడ్కర్.. సుప్రీంకోర్టులో కేసును వేసింది. ప్రస్తుతం పూజా పిటిషన్ ను గతంలో పలు మార్లు అత్యున్నత ధర్మాసనం విచారించింది.
తాజాగా.. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పూజా ఖేడ్కర్ మే 2న ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు అటెండ్ కావాలని స్పష్టం చేసింది. పోలీసులకు అన్నివిధాలుగా సహాకరించాలని సూచించింది. ఈ క్రమంలో.. తదుపరి విచారణను మే 21 కి వాయిదా వేసింది.
పూజా ఖేద్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కచ్చితమైన విచారణ జరగలేదన్న అత్యున్నత న్యాయస్థానం.. విచారణ త్వరగా ముగించాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పూజా ఖేడ్కర్ వ్యవహారం మరోసారి వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









