Supreme Court: తమిళనాడు గవర్నర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు, పెండింగు బిల్లులకు ఆమోదం

Supreme Court: తమిళనాడు గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య పంచాయితీలో గవర్నర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుల్ని తక్షణం ఆమోదించాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2025, 04:16 PM IST
Supreme Court: తమిళనాడు గవర్నర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు, పెండింగు బిల్లులకు ఆమోదం

Supreme Court: తమిళనాడు గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదించి పంపించిన 10 బిల్లుల్ని నిలిపివేయడంపై దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి ఘన విజయంగా మారింది. 

Add Zee News as a Preferred Source

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల వివిధ సందర్భాల్లో చేసిన 10 కీలకమైన బిల్లుల్ని ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి అడ్డుకున్నారు. అంతేకాకుండా ఈ బిల్లుల్ని రిజర్వ్ చేయాలని రాష్ట్రపతికి సైతం సూచించారు. గవర్నర్ చర్యను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చిది. గవర్నర్ చర్య చట్టవిరుద్ధమని తేల్చిచెప్పడమే కాకుండా గవర్నర్‌కు చివాట్లు పెట్టింది. గవర్నర్ తీసుకున్న చర్యలు ఏకపక్షమంటూ తీర్పు ఇచ్చింది. గవర్నర్ ఏ తేదీ నుంచి నిలిపివేశారో అదే తేదీ నుంచి ఆమోదం పొందినట్టుగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. ఇదొక చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఇది కేవలం తమిళనాడుకే కాకుండా మిగిలిన అన్ని రాష్ట్రాలకు అతి పెద్ద విజయమని చెప్పారు. 

సీబీఐలో పనిచేసిన ఆర్ఎన్ రవి 2021లో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టాలిన్ ప్రభుత్వంతో అంటీముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల గవర్నర్ తన ప్రారంభోపన్యాసంలో జాతీయగీతం ఆలపించనందుకు నిరసనగా సభ నుంచి నిష్క్రమించారు. తమిళ సంప్రదాయం ప్రకారం ప్రారంభంలో తమిళ్ తాయ్ వళ్తు అనే రాష్ట్ర గీతం ఆలపిస్తుంటారు. ముగింపులో మాత్రం జాతీయ గీతం ఆలపిస్తుంటారు. 2023లో గవర్నర్ సంప్రదాయ ప్రసంగం చదివేందుకు నిరాకరించారు. మరో సందర్భంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై పేర్లు చదవకుండా వదిలేశారు. 

Also read: Public Holidays: గుడ్‌న్యూస్, స్కూల్స్ ఆఫీసులకు వరుసగా 5 రోజులు సెలవులు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News